"పైకే చూడండి.. కింద చూడొద్దు" - ట్విట్టర్ లో జబర్దస్త్ రష్మీ సంచలన కామెంట్స్.!       2018-05-19   08:50:15  IST  Raghu V

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసింది. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమా హీరోయిన్‌గానూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. బుల్లితెర‌పై చిట్టి పొట్టి బట్టలతో తన అందాలను ఆరబోస్తూ జబర్ధస్త్ యాంకర్ అనిపించికుంది రేష్మి. అక్కడితో ఆగకుండా ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో తన హాట్ హాట్ అందాలను మాస్ ప్రేక్షకులకు నషాలానికి పట్టేలా చేసింది. ఈ సినిమా హిట్ కాలేనప్పటికీ.. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. కేవలం రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం రూ.40 కోట్లపైనే వసూలు చేసి నిర్మాతలకు కాసులు వర్షం కురిపించందంటే.. రేష్మి ఘాటైన గ్లామర్‌తో గుంటూర్ టాకీస్ వైపు ప్రేక్షకుల్ని రప్పించగలిగిందనే చెప్పాలి. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో హీరోయిన్‌గా రాణిస్తుందనే భావించారంతా.. అయితే ‘తను వచ్చెనంట’, ’నా నువ్వే’ చిత్రాల్లో నటించినప్పటికీ అవి రేష్మి కెరియర్ ఎదుగుదలకు ఏమాత్రం హెల్ప్ కాలేదనే చెప్పాలి.

అయితే అపజయం వెంటాడినప్పుడు కుంగిపోలేదు.. హీరోయిన్ అనే గ్లామర్ చట్రానికి పరిమితం కాకుండా తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరవైపే మక్కువ చూపించింది. ‘జబర్దస్త్ కామెడీ షో’ ద్వారా యాంకర్‌గా ప్రయాణం మొదలు పెట్టి నేటితో ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది రేష్మి.

ఈ సందర్భంగా.. జబర్దస్త్ కామెడీ షోలో గత నాలుగు సంవత్సరాలుగా.. 260 వారాలను కంప్లీట్ చేసుకున్నందుకు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. “తలపైకెత్తి చూస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఆ ఫోటోకు తగ్గట్లుగా అద్భుతమైన కొటేషన్‌ను చెప్పేసింది. ‘మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి అప్పుడే ఆశీస్సులు ఉంటాయి. కిందకు చూస్తే అగాధంలోనే పడిపోతారు’.. అంటూ నీతిసూక్తులు చెప్పుకొచ్చింది రేష్మి. “

రేష్మి కెరియర్ కష్టాలతోటే ప్రారంభమైంది. తాను ఇష్టపడ్డ కెరియర్‌ను వదులుకోలేక కుటుంబాన్ని వదిలి హైదరాబాద్ వచ్చి.. కేవలం రూ.10 వేల పారితోషికంతో కెరియర్ మొదలు పెట్టి ఒక్కోమెట్టూ ఎక్కుతూ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అయితే యాంకర్ అంటే ఇలాగే ఉండాలి.. ఇలానే యాంకరింగ్ చేయాలి.. తెలుగులో అనర్గళంగా మాట్లాడాలి.. కట్టు బొట్టు ఇలానే ఉండాలి లాంటి కండీషన్స్ ఈ జబర్దస్త్ యాంకర్స్‌కి వర్తించవనే చెప్పాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఇలా చూడాలని కోరుకుంటున్నారు.. వారికి నచ్చిన విధంగా ఎంటర్‌టైన్ చేయడమే మా బాధ్యత.. అంటూ పలు ఇంటర్వ్యూలలో తెగేసి చెప్పింది రేష్మి. మొత్తానికి బుల్లితెర గ్లామరస్ డాల్ రేష్మి మంచి మాటకారి అని తాజా పోస్ట్‌తో నిరూపించుకుంది.