ఆ ఫ్లెక్సీ ఏర్పాటుపై రేష్మి ఆగ్రహం !  

పాపులర్ యాంకర్ గా బుల్లి తెర మీద సందడి చేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనే కామెడీ ఎంటర్టైనర్ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే స్థాయిలో రేష్మి కూడా పాపులారిటీ సంపాదించుకుంది. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఆమె కనిపించేది. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆమె పాపులర్ అయ్యి ప్రస్తుతం కొన్ని కొన్ని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఆమె కనిపిస్తోంది.

Reshmi Angry On Flexi Without Permission-

Reshmi Angry On Flexi Without Permission

తాజాగా ఓ సంఘటన రేష్మీకి ఆగ్రహం తెప్పించింది. అదేంటి అంటే..? తిరుపతి లో రేష్మి – సుడిగాలి సుధీర్ ఉన్న ఫ్లెక్షి ఒక్కటి ప్రత్యేక్షమైనది. ప్రజలలో క్యాన్సర్ పైన అవగాహనా కోసం 9వ తేదిన 10k రన్ లో ముఖ్య అతిధులుగా రేష్మి , సుధీర్ వస్తున్నారు అంటూ ఆ ఫ్లెక్షిలో పేర్కొన్నారు.. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా రేష్మికి తెలియడంతో… ఆ ఫ్లెక్షిని వెంటనే తొలగించాలి అంటూ ఆమె నిర్వాకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు ఎవ్వరు నన్ను సంప్రదించలేదు అని అసలు నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా వేస్తారు అని ఆమె ప్రశ్నిస్తోంది.