ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కనుక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు.వారు చేసిన ప్రయత్నాలు ఒకసారి సఫలం కావచ్చు ఒకసారి విఫలం కావచ్చు.
అయినా కూడా వారు వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు.చెన్నైలోని ఓ సైంటిస్టుల బృందం గాలిలో ఉన్న తేమ ద్వారా నీటిని తయారు చేయవచ్చు అని కనిపెట్టారు.
ఈ టెక్నాలజీ పేరు అట్మాస్పియర్ వాటర్ జనరేటర్ అంటే గాల్లో నుంచి నీటిని సృష్టించడం.వాతావరణంలో ఉన్న తేమ ను ఉపయోగించి స్వచ్ఛమైన నీటి గా మార్చడం దీని ఉద్దేశం.
ఇలాంటిదే సరికొత్తగా సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాలిలో ఉన్న నీటిని వేరు చేసేందుకు సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు సరి కొత్తగా ఒక రసాయనిక మిశ్రమాన్ని రూపొందించారు.బయటినుండి ఎటువంటి శక్తిని అందించాల్సిన అవసరం లేకుండా ఈ మిశ్రమం గాల్లో నుంచి తేమ ను పీల్చి నీరుగా మార్చి బయటకు విడుదలచేస్తుంది అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఎయిరోజెల్ గంటకు 17 లీటర్లు నీటిని వేరు చేస్తుంది.ఎండాకాలంలో, లేదా వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ ఎయిరోజెల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.95 శాతం ఆవిరి నీటి గా మారుతుందని చెబుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు.
గాల్లోకి నిరంతరంగా చేరుతున్న నీటిని ఈ ఎయిరోజెల్ ద్వారా కావాల్సిన సమయంలో నీటిని పొందవచ్చని చెప్పారు