తెలంగాణాలో 'రిసార్ట్' రాజకీయాలు తప్పవా ..?

తెలంగాణాలో రాజకీయాలు అందరికి ఆసక్తి కలిగిస్తున్నాయి.నేడు ఏ పార్టీ పరిస్థితి ఏంటి .? అనే విషయం మధ్యాహ్నానికి తేలిపోనుండడంతో అందరిలోనూ ఒకటే టెన్షన్ కనిపిస్తోంది.అధికారం ఎవరికి దక్కుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ పార్టీలు మాత్రం ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Resart Political Dramas In Telangana-TeluguStop.com

కానీ ప్రధాన పార్టీలతో పాటు… ప్రజలను కూడా ఎగ్జిట్ పోల్స్ గందరగోళం లో పడేశాయి.టీఆర్ఎస్ అధికారాం చేపడుతుంది అని కొన్ని ప్రకటించగా … లగడపాటి మాత్రం కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ ప్రకటించాడు.

కాదు కాదు తెలంగాణాలో హంగ్ ఏర్పడుతుంది అంటూ మరికొన్ని సర్వే సంస్థలు ప్రకటించి పార్టీల్లో గుబులు రేపాయి.ఒక వేళ నిజంగా ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాకుండా హంగ్ ఏర్పడితే … ? ఇండిపెండెంట్‌లు కీలకం అవుతారు.అంతే కాదు… ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సహజంగా జరిగిపోతాయి.

ఒక వేళ అదే కనుక జరిగితే… కర్ణాటకలో ఉపయోగించిన ఫార్ములానే తెలంగాణాలో కూడా ఉపయోగించాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.అక్కడ అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన పోరు.రిసార్ట్ రాజకీయాలకు తెర తీసింది.

ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి యడ్యూరప్పను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన బీజేపీ.కాంగ్రెస్ వేసిన ఎత్తుగడతో వారం తిరగకుండానే బలపరీక్షలో ఓడిపోయి, అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

అనంతరం కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లున్న జేడీఎస్‌కు సీఎం పదవిని కట్టబెట్టింది.ప్రస్తుత పరిస్థితి చూస్తే … తెలంగాణలోనూ అదే వాతావరణం కనిపిస్తోంది.

అందుకే ఒకవేళ నిజంగా తెలంగాణాలో హంగ్ ఏర్పడితే అప్పుడు రాజకీయంగా వేయాల్సిన ఎత్తుగడలను గురించి ముందే ఒక ప్లాన్ వేసుకుని సిద్ధం అవుతోంది కాంగ్రెస్.

ఇదే విషయమై పార్టీ పెద్దలతో చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ కి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నాడు.అంతే కాకుండా… పార్టీ రెబల్స్‌తో, ఇండిపెండెంట్ అభ్యర్థులతో టచ్‌లో వాళ్లలో గెలిచే అవకాశాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.అవసరం అయితే రిసార్ట్ రాజకీయాలకు తెరలేపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.

ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు రాములు నాయక్, జలంధర్, శివకుమార్ రెడ్డిలను క్యాంప్‌కు పంపినట్టు తెలుస్తోంది.ఇక మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటూ… టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాట పట్టి… కేటీఆర్‌, హరీష్ రావులను రంగంలోకి దింపింది.

ఇప్పటికే ఎంఐఎం మద్దతు కూడా కూడగట్టిన టీఆర్ఎస్ పార్టీ … హంగ్ ఏర్పడినా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనే ధీమాలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube