'వైసీపీ గెలుపు'- రిపబ్లికన్ సర్వే టీడీపీ వ్యుహమా..???

ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ గేమ్ నడుస్తోంది.పార్టీలపై వ్యూహ ప్రతి వ్యూహాల అమలు విషయంలో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి.

 Republican Survey Is Ys Jagan Is Next Cm-TeluguStop.com

ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొన్నా, వివిధ సర్వేలు ఏపీలో చక్రం తిప్పేది ఇదే అంటూ ఊహించని విధంగా లెక్కలు వేస్తూ రాబోయే ఫలితాలని సదరు పార్టీలకి రుచి చూపిస్తున్నాయి.ఈ క్రమంలో గత కొంతకాలంగా ఏపీలో వివిధ సర్వేలు చేసిన లెక్కల ప్రకారం.

అధికశాతం వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి.అయితే తాజాగా రిపబ్లిక్ టీవీ – సి వోటర్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో జగన్ కే సీఎం సీటు అంటూ డిసైడ్ చేశాయి.ప్రజా మద్దతు జగన్ కి ఓ లెవిల్ లో ఉందంటూ తేల్చిన ఈ సర్వే వైసీపీకి తిరుగులేదు అని చెప్పేసింది.తెలంగాణలో ఎన్నికల ముందు సైతం ఈ సర్వే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అంటూ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.

ఈ ఈక్వేషన్స్ లెక్కలోకి తీసుకుని వైసీపీ కేడర్ , నేతలు , కార్యకర్తలు అందరూ తెగ సంబరాలు చేసుకున్నారు.కాని ఓ విశ్లేషకుడు మాత్రం దీనికి భిన్నంగా విశ్లేషణ చేసి వైసీపీ లో నిరాస నింపాడు.

ఇంతకీ ఏమిటా విశ్లేషణ అంటే.

రిపబ్లికన్ సర్వే బాబు వ్యూహంలో భాగమే అంటూ కొత్త స్వరం అందుకున్నాడు.

బాబుగారి ఉచ్చులో జగన్ పడ్డాడు బీ కేర్ ఫుల్ అంటూ సోషల్ మీడియాలో సైతం సున్నితంగా హెచ్చరించాడు.వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఏపీలో తన పాదయాత్రతో ఏపీలో ఒక ఊపు తీసుకు వచ్చాడు.

దాంతో కేడర్ మొత్తం ఫుల్ జోష్ లో ఉంది.కాని ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉన్నాయి.

వాటిలో ఇప్పటి వరకూ వైసీపీ కి 20 స్థానాలలో సరైన అభ్యర్ధులు లేనే లేరు.

అసలు ఎవరిని ఉంచాలో ఇప్పటికి జగన్ తేల్చుకోలేదు.ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ని కుదేలు చేయాలంటే తప్పకుండా జగన్ లో ఉన్న కాన్ఫిడెంట్ ని ఓవర్ కాన్ఫిడెంట్ గా చేస్తే చాలు.ఇదే టీడీపీ వ్యూహం అంటున్నారు.

అందుకోసమే ఈ సర్వేల హడావిడి ఒక్క సారిగా వచ్చి పడుతోంది అనేది వారి వాదన.గత ఎన్నికల ముందుకూడా జగన్ కి సర్వేలు అన్నీ పట్టం కట్టాయి.

సీఎం జగనే అంటూ కోడై కూశాయి దాంతో జగన్ అండ్ కో చివరకి బోల్తా పడ్డారు.మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేయడానికి టీడీపీ పన్నిన వ్యూహంలో భాగమే ఈ సర్వేలు అంటున్నారు.

కొందరు విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం.మరి జగన్ టీడీపీ ట్రాప్ లో పడుతాడో, లేక విజయం సాధిస్తాడో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube