అమెరికా ప్రభుత్వంపై రిపబ్లికన్ పార్టీ “రూల్స్” రాజకీయం...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది.కరోనా నిభందనలు పాటించని కారణంగానే అమెరికాలో మరణ మృదంగం మొగిందని, తప్పకుండా కరోన నిభంధనలు పాటించి తీరాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంటే మరో పక్క ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం మీ రూల్స్ పాటించేది లేదంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

 Republican Party rules Politics Against The American Government , Politics, Amer-TeluguStop.com

అంతేకాదు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే కరోనా రూల్స్ ను బ్రేక్ చేయాలని ఇకపై ఎలాంటి నిభందనలు అమలు చేయద్దంటూ ఫ్లోరిడా రాష్ట్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

అమెరికాలో ఇప్పటికే చాలామంది మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటూ ఆందోళన చేస్తున్న విషయం విధితమే.వ్యాక్సిన్ చేసుకున్న తరువాత ఇక మాస్క్ ఎందుకు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటొందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చివరికి స్కూల్ లో మాస్క్ లు పెట్టడం వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఈ మాస్క్ నిభందనలు సడలించాలని ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ నేతలు తమకు ఎక్కువగా పట్టున్న ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు కరోనా నిభంధనలను సడలించాలనే విషయంపై చర్చ ఏర్పాటు చేశారు.

ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా నిభంధనలను ఎత్తేయాలని ఫ్లోరిడా రాష్ట్రంలో రిపబ్లికన్ లు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాస్క్ నిభందన ఎత్తేయాలని అలాగే స్కూల్ లలో మాస్క్ లు తప్పనిసరి చేసే వారిపై కేసులు వేసేలా చర్యలు తీసుకునే నిభందనలు కలిగించాలని ఈ రెండు అంశాలపై ఫ్లోరిడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవలాని రిపబ్లికన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై మాత్రం ట్రంప్ తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు.రిపబ్లికన్ పార్టీ ప్రజలు తప్పుదోవ పట్టిస్తోందంటూ మండిపడుతున్నారు.

అమెరికాలో మరో సారి మారణహోమం జరగకుండా ఉండాలంటే మాస్క్ లు తప్పనిసరని ఈ విషయంలో రాజీ పడే ప్రశక్తిలేదని తేల్చి చెప్తున్నారు బిడెన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube