ఆమెను తప్పించండి...కమలా హారీస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..!!

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఊహించని విధంగా బాధ్యతలు చేపట్టిన కమలా హారీస్ మొట్ట మొదటి అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.భాద్యతలు చేపట్టింది మొదలు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

 Republican Party Leaders Demand Kamala Unfit Illegal Immigrants-TeluguStop.com

కానీ రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం కమలా హారీస్ అసమర్ధురాలు ఆమెను తప్పించండి అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.కమలా హారీస్ భాద్యత లేని వ్యక్తి , ఆమెకు అమెరికన్స్ ప్రయోజనాలు ముఖ్యం కాదంటూ ఆందోళనలు చేస్తున్నారు.

ఇంతకీ రిపబ్లికన్ పార్టీ నేతలు ఇంతగా కమలా పై మండిపడటానికి కారణం ఏంటంటే.

 Republican Party Leaders Demand Kamala Unfit Illegal Immigrants-ఆమెను తప్పించండి…కమలా హారీస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వలస వాసుల విషయంలో కటైనమైన వైఖరిని అవలంభించేది.

అయితే డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వలస వాసుల నియంత్రణ భాద్యతలు బిడెన్ కమలా హారీస్ కు అప్పగించారు.ఈ క్రమంలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే వలస వాసుల సంఖ్య అమాంతం పెరగడం మొదలు పెట్టింది.

వీరిలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు వారిని నిర్భందించడం వంటి చర్యలు బిడెన్ కు ఇబ్బందులు కలిగించాయి.దాంతో ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని బిడెన్ కమల హారీస్ ను ఆదేశించారు.అయితే

అధ్యక్షుడు బిడెన్ హారీస్ కు ఈ బాధ్యతలు అప్పగించి దాదాపు 85 రోజులు అవుతున్నా హారీస్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని, వలస వాసులను నియంత్రించే విషయంలో కమలా సంభందిత అధికారులతో ఇప్పటి వరకూ చర్చలు జరపలేదని, ఓ ప్రణాళిక కూడా చేయకపోవడం విచారకరమని రిపబ్లికన్ లు నిరసనలు తెలుపుతున్నారు.ఇప్పటి వరకూ కమలా సరిహద్దుల వద్ద పర్యటించిన పరిస్థితులు లేవని, అలాంటప్పుడు ఆమెకు బిడెన్ ఇచ్చిన బాధ్యతల నుంచీ తప్పించాల్సిందే నని పట్టుబడుతున్నారు, అంతేకాదు ఆమెకు ఇచ్చిన అధికారాలు వెంటనే తీసేయాలంటూ 56 మంది రిపబ్లికన్ నేతలు లేఖల ద్వారా డిమాండ్ చేశారు.అయితే ఈ సమస్య పై ఇప్పటికే కమలా సంభందిత అధికారులతో చర్చించడమే కాకుండా మెక్సికో దేశ నాయకులతో చర్చించిందని, తెలుస్తోంది కావాలనే రిపబ్లికన్ పార్టీ కమలాను టార్గెట్ చేసిందంటూ ఆమె మద్దతు దారులు కౌంటర్ ఇస్తున్నారు

#Joe Biden #Kamala Harris #RepublicanParty #RepublicanParty

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు