ఆ ఛానల్ కి 200 కోట్లు పరువునష్టం దావా వేసిన నిర్మాత

నేషనల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమైన వ్యక్తి అర్ణబ్ గోస్వామి.న్యూస్ ప్రెజెంటేటర్ గా అతని శైలి చాలా భిన్నంగా ఉంటుంది.చర్చలు నిర్వహిస్తూ ఒక్కోసారి ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాడు.చర్చలో పాల్గొనే నాయకులు ఎలాంటి వారైనా తన మాటలతో, ప్రశ్నలతో భయపెడతాడు అనే అపవాదు ఉంది.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ణబ్ గోస్వామి చర్చలకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు అంటూ వారిపైన అతని ప్రభావం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.రిపబ్లిక్ టీవీ స్టార్ట్ చేసిన తర్వాత అర్ణబ్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.

 Republic Tv Gets Legal Notice Of Defamation, Bollywood, Sushant Singh Rajput, Ar-TeluguStop.com

బీజేపీ సపోర్టర్స్ అందరూ అర్ణబ్ ని అభిమానిస్తూ ఉంటారు.అయితే తాజాగా సుశాంత్ ఇష్యూలోకి బాలీవుడ్ మొత్తాన్ని లాగి ఎక్కువ రచ్చ చేసిన వ్యక్తిగా అర్ణబ్ పై బాలీవుడ్ సెలబ్రెటీలకి విపరీతమైన కోపం ఉంది.

కొద్ది రోజుల క్రితం టీఆర్పీ రేటింగ్స్ లో మోసాలకు పాల్పడుతున్న కేసులో రిపబ్లిక్ టీవీకి ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మరో వైపు అర్ణబ్ అతిని భరించలేకపోతున్నామని, కావాలని బాలీవుడ్ అందరిని టార్గెట్ చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ సెలబ్రెటీ ప్రముఖులు అతనిపై కోర్టులో కేసు వేశారు.

ఈ నేపధ్యంలో అతని మీద ముప్పేట దాడి చేసేందుకు అవకాశం ఉన్న అందరూ ప్రయత్నం చేస్తున్నారు.రిప‌బ్లిక్ టీవీ త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించేలా క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసింద‌ని, న‌ష్ట‌ప‌రిహారం కింద రూ.200 కోట్లు చెల్లించాలంటూ సుశాంత్ సింగ్ మిత్రుడు , బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ కోర్టుకెక్కాడు.ఇందులో భాగంగా రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి, ఆ ఛాన‌ల్‌ ఎడిట‌ర్ అర్న‌బ్ గోస్వామికి నోటీసులు పంపించాడు.

ఛాన‌ల్ టీఆర్పీ పెంచుకోవ‌డం కోసం త‌న‌ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా నిరాధార, అస‌త్య‌ క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేశార‌ని ఆయ‌న నోటీ సుల్లో పేర్కొన్నాడు.సుశాంత్ కేసులో త‌న‌ను కీల‌క సూత్ర‌ధారిగా, హంత‌కుడిగా నిర్ధారిస్తూ రిప‌బ్లిక్ టీవీ క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసింద‌ని అత‌ను ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube