ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపిన సీఈసీ  

Repolling Will Be Conducted In Five Polling Stations-five,general Telugu Updates,polling Stations,repolling,సీఈసీ

గత నెల ఏప్రిల్ 11 న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎం లలో తలెత్తిన లోపాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ నెల 6 వ తేదీన ఐదు పోలింగ్ కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించనున్నారు. నెల్లూరు,గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున,ప్రకాశం జిల్లా లో ఒక చోట రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లాలోని సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే గత నెలలో జరిగిన ఎన్నికల సమయంలో ఈవీఎం లలో లోపాలు తలెత్తడం తో రీపోలింగ్ కోరుతూ స్థానిక కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కి నివేదికలు పంపడం తో కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడం తో సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..

ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపిన సీఈసీ -Repolling Will Be Conducted In Five Polling Stations