నాగబాబు ప్లేస్‌ను వీళ్లలో ఎవరు భర్తీ చేస్తారబ్బా..?

జబర్దస్త్‌ నుండి నాగబాబు ఔట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.ఎనిమిది సంవత్సరాలుగా జబర్దస్త్‌లో జడ్జ్‌గా కొనసాగుతున్న నాగబాబు మరో ఛానెల్‌లో ఒక షోకు జడ్జ్‌గా వ్యవహరించబోతున్నాడు.

 Replace Nagababu Place In Jabardasth-TeluguStop.com

తనతో పాటు పలువురు కమెడియన్స్‌ను కూడా జబర్దస్త్‌ నుండి నాగబాబు తీసుకు వెళ్లాడంటూ సమాచారం అందుతోంది.ఇంతగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జబర్దస్త్‌ ప్రేక్షకులు అంతా కూడా కంగారు పడిపోతున్నారు.

ఇక జబర్దస్త్‌కు పెద్ద దిక్కు ఎవరు అంటూ తెగ బాధపడి పోతున్నారు.

Telugu Aadhi, Anasuya, Getup Sreenu, Jabardast Roja, Jabardasth, Nagababu, Roja-

జబర్దస్త్‌ నుండి నాగబాబు వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన స్థానంను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే మల్లెమాల వారు అలీ, బండ్ల గణేష్‌తో చర్చలు జరిపారట.అలీ తన వల్ల కాదని చెప్పగా బండ్ల గణేష్‌ ఆలోచిస్తున్నాడట.

మరో వైపు సాయి కుమార్‌ను కూడా ఈ కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించాలంటూ మల్లెమాల వారు కోరారట.మొత్తానికి చాలా మంది జబర్దస్త్‌ కార్యక్రమానికి జడ్జ్‌గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Aadhi, Anasuya, Getup Sreenu, Jabardast Roja, Jabardasth, Nagababu, Roja-

మరో రెండు మూడు వారాల్లో కొత్త జడ్జ్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కొత్త జడ్జ్‌ వచ్చిన తర్వాత జబర్దస్త్‌ పరిస్థితి ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నాగబాబు ప్లేస్‌ను భర్తీ చేసేందుకు చాలా మంది పేర్లు అయితే పరిశీలిస్తున్నారు.కాని వీరిలో ఎవరు నాగబాబు పాత్రను పూర్తిగా పోషించగలరు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.షోలో ప్రధాన హైలైట్‌ అయిన నాగబాబు లేకుండా షో ఎలా ఉంటుందా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube