దిశ నిందితుడు భార్యకి ఆర్జీవీ ఆర్ధిక సాయం!

ఆర్జీవీలో ఉండే మరో సోషల్ యాటిట్యూడ్ ఈ మధ్య కాలంలో బయటపడుతుంది.దిశ ఘటన తర్వాత మహిళల మీద జరిగే అత్యాచారాలు, హత్యలపై ఎక్కువగా స్పందిస్తూ తన సామాజిక దృక్పథాన్ని చూపిస్తున్నారు.

 Renuka Rgv Chenna Keshavulu-TeluguStop.com

దిశ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులని హీరోలుగా అభివర్ణించిన ఆర్జీవి ఇప్పుడు ఆ ఘటన మీద సినిమా తీయడానికి రెడీ అయ్యి స్టొరీ మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు.ఇప్పటికే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే కోణంలో తన బుర్రకి వర్మ పని పెట్టాడు.

ఇదిలా ఉంటే ఈ ఘటనలో మరిన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి ఆర్జీవీ దిశ నిందితులలో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకి కలుసుకున్నాడు.ఆమెని తన ఆఫీస్ కి పిలిపించి ఆమెతో మాట్లాడారు.

చెన్నకేశవులు, ఆమె ప్రేమ, పెళ్లి గురించి విషయాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె గురించి వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.16 ఏళ్లకే రేణుకకి పెళ్లి అయింది.17 ఏళ్ళకి ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.చెన్నకేశవులు దిశనే కాదు.

రేణుకను కూడా మోసం చేశాడు.

రేణుక ఇంకా చిన్న పిల్ల.అలాంటిది ఆమె త్వరలో ఓ పిల్లకు జన్మనివ్వబోతోంది.

ఇప్పుడు ఆమెకి, తన బిడ్డకి భవిష్యత్తు లేకుండా పోయింది అంటూ ట్వీట్ చేశాడు.ఇదిలా ఉంటే ఈ సందర్భంగా వర్మ తనలో ఉన్న మరో యాంగిల్ ని కూడా బయట పెట్టినట్లు తెలుస్తుంది.

రేణుకకి బ్లాంక్ చెక్ ఇచ్చి ఆమెకి కావాల్సినంత రాసుకోమని ఆమె జీవితానికి కావాల్సిన భరోసాకి ఆర్ధిక సాయం చేసినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఇంత వరకు ఎవరో ఒకరిని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకున్న వర్మ ఇలా రోడ్డున పడ్డ ఒక ఆడపిల్లని ఆడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube