జగన్ కు 'కమ్మ ' ద్వేషం ? రేణుక ఆరోపణల్లో నిజమెంత ?

వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ రాజకీయం చేస్తున్నట్లుగా  అందరికీ అర్థమైపోయింది.ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు , కొన్ని టీడీపీ అనుకూల మీడియా లను టార్గెట్ చేసుకునే క్రమంలో కమ్మ సామాజిక వర్గం మొత్తాన్ని దూరం చేసుకునే విధంగానే వ్యవహరిస్తున్నట్లు గా ప్రవర్తించారు.

 Renuka Chowdary Serious Comments On Ys Jagan About Amaravathi Jagan, Ysrcp, Ap,-TeluguStop.com

ఆ సామాజిక వర్గానికి ఎన్ని రకాలుగా మేలు చేసినా, ప్రాధాన్యం కల్పించినా,  వారంతా టీడీపీ వెంటే ఉంటారని , వైసీపీ వైపు వచ్చే ఛాన్స్ లేదని డిసైడ్ అయిపోయిన జగన్ ఆ సామాజిక వర్గాన్ని టాబ్లెట్ చేసుకున్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

 టిడిపి హయాంలో కమ్మ సామాజిక వర్గానికి తప్ప మిగతా వర్గాలకు ఒరిగింది ఏమీ లేదనే అభిప్రాయాలను జనాల్లో కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా అమరావతి విషయంలో ఇదే రకమైన వ్యవహార శైలి కనిపించింది.కేవలం కమ్మ సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి లో రాజధాని నిర్మాణం చేపట్టిందనే సంకేతాలను రాష్ట్రమంతా తీసుకువెళ్లేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

అలాగే అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసిపి మాజీమంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తో ఆ సామాజిక వర్గం టిడిపి నాయకుల పైన తీవ్రపదజాలంతో విమర్శలు చేయించడం వంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి.పూర్తిగా జగన్ కమ్మ వ్యతిరేకి అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఇదే అంశంపై నిజామాబాద్ లో నిర్వహించిన కమ్మ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి అనేక సంచలన ఆరోపణలు జగన్ ప్రభుత్వం పై చేశారు.

Telugu Chandrababu, Jagan, Kamma, Renuka Chowdary, Ysrcp-Telugu Political News

ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణిచివేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని , అమరావతి కేంద్రంగా ఇదంతా జరుగుతోందని రేణుకాచౌదరి విమర్శించారు.ఈ సందర్భంగా జగన్ కు రేణుక సవాల్ విసిరారు.అమరావతికి కమ్మరావతిగా పేరు పెట్టాలంటూ సవాల్ చేశారు.

అమరావతిని కమ్మరావతిగా హేళన చేస్తున్న జగన్ , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యలను రేణుక తప్పుబట్టారు.తమ సామాజిక వర్గాన్ని తక్కువగా అంచనా వేయవద్దని, కమ్మ సామాజిక వర్గం మంచితనాన్ని బలహీనతగా చూడొద్దంటూ హితవు పలికారు.

రాష్ట్రం నిలబడాలి అంటే అన్ని కులాలు అవసరం ఉందని ఆమె సూచించారు.ప్రస్తుతం రేణుక వ్యాఖ్యలపై రాజకీయంగాను చర్చ జరుగుతోంది.

మొదటి నుంచి జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని,  ఆ సామాజిక వర్గాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు జగన్ పై ఉన్నాయి.ఇక ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ ప్రత్యర్థుల పై అదే సామాజికవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో విమర్శలు చేయిస్తూ వస్తుండడం ఇవన్నీ ఆ సామాజిక వర్గం లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

ఇప్పుడు అదే ఆగ్రహం రేణుక తన వ్యాఖ్యలతో బయటపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube