నా జుట్టు తెల్లగా మారుతోందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న రేణుదేశాయ్.. వీడియో వైరల్?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంలో కొన్ని సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె నటనకు పూర్తిగా దూరమయ్యారు.

 Renu Desai Is Happy That My Hair Is Turning White Video Viral Details, Tollywood, White Hair, Viral Video, Renu Desai, Renu Desai Makeup, Renu Desai White Hair, Tiger Nageswara Rao, Mass Maharaj Raviteja, Pawan Kalyan-TeluguStop.com

ఇలా చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రేణుదేశాయ్ మేకప్ వేసుకున్న ఫోటోలను వీడియోలను షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియోని షేర్ చేస్తూ నా జుట్టు మొత్తం తెల్లగా మారిపోయిందనీ చెప్పడమే కాకుండా, తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోతో పాటు స్లీపీ మార్నింగ్ అంటూ మరో వీడియోను కూడా ఇన్‌స్టాలో పెట్టారు.

 Renu Desai Is Happy That My Hair Is Turning White Video Viral Details, Tollywood, White Hair, Viral Video, Renu Desai, Renu Desai Makeup, Renu Desai White Hair, Tiger Nageswara Rao, Mass Maharaj Raviteja, Pawan Kalyan-నా జుట్టు తెల్లగా మారుతోందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న రేణుదేశాయ్.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రేణు దేశాయ్ ఈ వీడియోలో ఇంకా నిద్ర మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ తన పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు రేణుదేశాయ్ ని ప్రశ్నిస్తూ టైగర్ నాగేశ్వరరావు కోసమే ఈ మేకప్ వేసుకుంటున్నారా మేడమ్ అంటూ కామెంట్లు చేయగా అందులో మీరు ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలకపాత్రలో సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం రేణుదేశాయ్ మేకప్ వేసుకుంటున్న వీడియోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది.మరి ఈమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో సందడి చేయనున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube