టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త విరామం నుంచి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే నటి రేణు దేశాయ్( Renu Desai ) పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత తనతో వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని వెళ్ళిపోయారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పిల్లలు అఖీరా,( Akira ) ఆధ్య( Aadhya ) ఇద్దరు కూడా తన తల్లి వద్దంటున్నారు.ప్రస్తుతం అఖీరా ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయారు.ఇక ఆద్య తన తల్లి వద్దే ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇక రేణు దేశాయ్ ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక సినిమా పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆధ్య ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడించారు.ఆద్య ఇన్ని రోజులకు ముక్కుపుడక పెట్టుకుందనే విషయాన్ని ఈమె ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు.ఆద్యకు ఎప్పటినుంచో ముక్కుపుడక పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ కుదరడం లేదని ఎట్టకేలకు తనకు ముక్కుపుడక పెట్టించాను అంటూ ఈమె తెలియజేశారు.
అమ్మాయిలు చెవులు ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు.ఇలా ఆభరణాలు పెట్టుకోవడమే అమ్మాయిలకు పెద్ద అలంకరణ అంటూ రేణు దేశాయ్ ఆధ్య ఫోటోని షేర్ చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.