చెర్రీ ప్రొడక్షన్ లో అకీరా తోలి సినిమా, స్పందించిన రేణు  

Renu Desai Responds On Ramcharan Introduced Akira Nandan - Telugu Akira Nandan, Janasena Party, Pawan Kalyan, Ramcharan, Renu Desai

సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కు పెద్ద కొదవేమీ లేదు.రోజు కొక రూమర్ ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

Renu Desai Responds On Ramcharan Introduced Akira Nandan

అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఇప్పుడు తాజాగా ఒక టాపిక్ హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ లోనే తోలి సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి రాజకీయ నేతగా బాగా బిజీ అయిపోయి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

చెర్రీ ప్రొడక్షన్ లో అకీరా తోలి సినిమా, స్పందించిన రేణు-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అకీరా ను తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెగ ప్రచారం ఊపందుకుంది.మెగా కుటుంబం నుంచి మరో వారసుడు రాబోతున్నాడు అంటూ తెగ వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ మాజీ భార్య,అకీరా తల్లి,నటి రేణు దేశాయ్ స్పందించారు.

 ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వెబ్ సైట్స్ ని నమ్మవద్దు అంటూ తెలిపారు.ఒకవేళ నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మా అఫీషియల్ ఖాతాల ద్వారా తెలియజేస్తామంటూ రేణు సమాధానం చెప్పారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేస్తున్న వెబ్ సైట్స్ పై ఆమె మండిపడ్డారు.పిల్లల పైఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు