బిగ్‌బాస్‌ వార్తలపై రేణుదేశాయ్‌ క్లారిటీ.. ఇకపై అయినా మూసుకోండి  

Resai Giving Clarity In Big Boss Show-nagarjuna,resai,telugu,బిగ్‌బాస్‌ సీజన్‌ 3,రేణు దేశాయ్

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3 వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున మూడవ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే రెండవ సీజన్‌లో పార్టిసిపెంట్స్‌ విషయంలో జరిగిన తప్పిదాలను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకునేందుకు నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పడుతున్నారు..

బిగ్‌బాస్‌ వార్తలపై రేణుదేశాయ్‌ క్లారిటీ.. ఇకపై అయినా మూసుకోండి -Renudesai Giving Clarity In Big Boss Show

చాలా ఫేమస్‌ అయిన సెలబ్రెటీలను మాత్రమే ఈ షో కోసం తీసుకు రావాలని నిర్ణయించారు. అందుకోసం రేణుదేశాయ్‌ వంటి ప్రముఖులను సంప్రదించారట. రేణు దేశాయ్‌ మూడవ సీజన్‌లో పార్టిసిపేట్‌గా కనిపించబోతుందని గత ఆరు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఆ అవసరం లేదని, ఆమె బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజన్‌లో కనిపించదని ఎంతగా చెప్పినా కూడా కొందరు పదే పదే ఆ విషయాన్ని ప్రచారం చేశారు.

తాజాగా రేణు దేశాయ్‌ ఆ విషయమై క్లారిటీ ఇచ్చేసింది..

రేణు దేశాయ్‌ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పాల్గొనబోతున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. తనకు ఆ ఆసక్తి లేదని చెప్పడంతో ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. ఇకపై అయినా అన్ని మూసుకోవాలని ప్రచారం చేస్తున్న వారికి ఇండైరెక్ట్‌గా రేణు దేశాయ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

రేణు దేశాయ్‌ అయితే క్లారిటీ ఇచ్చింది. ఇంకా పలువురి పేర్లు ప్రస్థావనకు వస్తున్నాయి. మరి వారు ఎప్పుడు ఈ విషయమై క్లారిటీ ఇస్తారో చూడాలి.