టైగర్ నాగేశ్వరరావు నుండి రేణుదేశాయ్ ఫస్ట్ లుక్..!

Renu Desai’s Look From Tiger Nageswara Rao Unveiled, Tiger Nageswara Rao, Renu Desai, Renu Desai First Look, Ravi Teja

మాస్ మహారాజ రవితేజ( Ravi teja ) ఇప్పటికి ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.

 Renu Desai’s Look From Tiger Nageswara Rao Unveiled, Tiger Nageswara Rao, Renu-TeluguStop.com

ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Telugu Ravi Teja, Renu Desai, Renudesais, Tigernageswara-Movie

ప్రజెంట్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”( Tiger Nageswara Rao ). నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో వరుస ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో రేణు దేశాయ్( Renu Desai ) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.చాలా రోజుల తర్వాత ఈమె ఈ సినిమాలో నటిస్తుంది.

మరి ఎప్పుడెప్పుడు ఈమె లుక్ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Telugu Ravi Teja, Renu Desai, Renudesais, Tigernageswara-Movie

ఎట్టకేలకు ఈమె లుక్ ను మేకర్స్ రివీల్ చేసారు.రేణు దేశాయ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్( Renu Desai Tiger Nageswara Rao First Look ) లో ప్లెజెంట్ గా చిరునవ్వుతో సింపుల్ గా కనిపించారు.ఇక ఈమె హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ తో తెలిపారు.

ఇక ట్రైలర్ అక్టోబర్ 3న రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్( Gayatri Bharadwaj ) హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు.

అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube