ఫ్యాన్స్‌ రెడీనా.. దసరా రోజు రేణు దేశాయ్‌ కీలక ప్రకటన  

renu desai web series starts on dasara festival , renu desai , pawan kalyan wife, Dasara festival, web series, - Telugu Mega Fans, Mega Hero, Pawan Kalyan, Renu Desai, Web Series

రేణు దేశాయ్ నటించింది రెండు సినిమాల్లోనే అయినా ఆమె పవన్ కళ్యాణ్ భార్య అవ్వడం వల్ల విపరీతమైన ఫాలోయింగ్ ని దక్కించుకుంది.పవన్ నుండి విడిపోయిన తర్వాత కూడా ఆమెను నెటిజన్స్‌ ఫాలో అవుతూనే ఉన్నారు.

TeluguStop.com - Renu Desai Web Series Starts On Dasara Festival

ఆమె ఏం చేసినా కూడా నెటిజెన్స్ మరియు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తూ ఉంటారు.ఆ మధ్య పూణే నుండి హైదరాబాదు మకాం మార్చిన రేణు దేశాయ్ తెలుగులో వరుసగా సినిమాల్లో నటించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.

కానీ గత ఆరేడు నెలలుగా కరోనా కారణంగా ఆమె షూటింగ్ లకు హాజరు కాలేదు.ఎట్టకేలకు దసరా నుండి ఆమె కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది అని తెలుస్తోంది.

TeluguStop.com - ఫ్యాన్స్‌ రెడీనా.. దసరా రోజు రేణు దేశాయ్‌ కీలక ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మొదట ఆమె ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించబోతుంది.ఆ తర్వాత వరుసగా సినిమాల్లో కూడా నటిస్తుందని సమాచారం అందుతోంది.

మొత్తానికి దసరా రోజున రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సందర్భంగా అంతా కూడా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
రీ ఎంట్రీ తో అయిన సినిమాలు చేయాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెబ్ సిరీస్ తో మరియు బుల్లి తెరపై ఆమె ఇప్పటికే సందడి చేసేందుకు రెడీ అయింది.సినిమాల్లో త్వరలోనే ఆమె నటిస్తుందని అంతా ఆశిస్తున్నారు.ఆమధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో కీలక పాత్రకు ఆమెను ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి.కానీ అది నిజం కాదని క్లారిటీ ఇచ్చింది.2022 వరకు అయినా ఆమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమెను ఫాలో అవుతున్న వారు నమ్ముతున్నారు.మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చెప్పింది.

ఆ కారణంగా ఆమెను తమ కథలతో ఒప్పించేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

#Pawan Kalyan #Mega Hero #Renu Desai #Mega Fans #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Renu Desai Web Series Starts On Dasara Festival Related Telugu News,Photos/Pics,Images..