రేణుదేశాయ్‌కి ఇంకో కూతురు?       2018-06-27   01:34:37  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండవ వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఇటీవలే రేణుదేశాయ్‌ వివాహ నిశ్చితార్థం కూడా అయ్యింది. ఈ సమయంలోనే ఈమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన రెండవ పెళ్లి గురించి, తన పిల్లల గురించి ఇలా రకరకాల విషయాలను సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంది. తాజాగా ఈమె తన కూతురు ఆధ్య మరో పాపతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఆ ఫొటోతో ఒక విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పేసింది. ఆ పాప తన రెండో కూతురు అంటూ చెప్పకనే చెప్పింది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు ఇప్పటి వరకు స్నేహితులు మాత్రమే, ఇకపై వారిద్దరు ఒకే ఇంటి వారు అవ్వబోతున్నారు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంటే వారిద్దరు ఇకపై ఒకే ఇంట్లో, సొంత వారిగా ఉండబోతున్నారన్న మాట. అంటే రేణుదేశాయ్‌ చేసుకోబోతున్న వ్యక్తికి అంతకు ముందే పాప ఉందని, ఆ పాప ఆద్యకు స్నేహితురాలు అయ్యి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆద్య వల్ల అతడితో రేణుదేశాయ్‌కి పరిచయం ఏర్పడి ఉండవచ్చు అంటూ కూడా కొందరు భావిస్తున్నారు.

రేణుదేశాయ్‌కి ఇప్పటికే ఒక బాబు, ఒక పాప ఉన్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత మరో పాపతో రేణుదేశాయ్‌ మళ్లీ తల్లి అవ్వబోతుంది. ఇక రేణుదేశాయ్‌కి ముగ్గురు పిల్లలు అవ్వనున్నారన్నమాట. ఇక రేణుదేశాయ్‌ రెండవ భర్త ద్వారా మరో పాప లేదా బాబుకు జన్మనిచ్చే అవకాశం కూడా లేక పోలేదు అనే టాక్‌ వినిపిస్తుంది. అదే జరిగితే రేణుదేశాయ్‌ సంతానం నాలుగుకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు పెద్ద వారు అయిన క్రమంలో ఇంకా కూడా పిల్లలకు ఆమె జన్మనిస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది.

అయితే రేణుదేశాయ్‌ రెండవ భర్త ఇద్దరి ప్రేమకు జ్ఞాపకంగా పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఆమె మళ్లీ తల్లి అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రేణుదేశాయ్‌ వ్యవహారం గత మూడు రోజులుగా సోషల్‌ మీడియాను కుదిపేస్తుంది. ఒక వైపు రేణుదేశాయ్‌కు అభినందనలు, ఆల్‌ది బెస్ట్‌లు చెబుతుంటే కొందరు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దాంతో ట్విట్టర్‌కు రేణుదేశాయ్‌ గుడ్‌ బై చెప్పేసింది. ట్విట్టర్‌లో తిట్లతో ఆమెను విమర్శిస్తున్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌ను వీడటం జరిగింది.