అందుకే తల్లి పాత్రకి నో చెప్పానంటున్న రేణుదేశాయ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా ప్రముఖ నిర్మాత కుమారుడు అయినటువంటి శివ కందుకూరి నటించిన “చూసి చూడంగానే” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రేణు దేశాయ్ హాజరయ్యారు.

 Renu Desai That Is Why Said N To The Mother Character Role In Chusi Chudangane-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ చిత్రం గురించి మాట్లాడుతూ నటన పరంగా అనుభవం లేకున్నప్పటికీ శివ కందుకూరి చాలా బాగా నటించాడని కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించగల నమ్మకం తనకు ఉందని అన్నారు.అలాగే ఈ చిత్రంలోని హీరో తల్లి పాత్రలో తనకి నటించే అవకాశం వచ్చిందని కానీ ఈ చిత్ర షూటింగ్ సమయంలో బాగోలేని కారణంగా నటించలేనని అందుకే తల్లి పాత్రకి నో చెప్పానని చెప్పుకొచ్చారు రేణుదేశాయ్.

తర్వాత ఈ చిత్రంలోని ఓ పాటను తన చేతుల మీదుగా విడుదల చేయించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కచ్చితంగా ఈ సినిమాలోని పాటలు మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని అన్నారు.అయితే ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన ఇటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ కి అభినందనలు తెలిపారు.

Telugu Renu Desai, Renudesai-Movie

అలాగే తాను ప్రస్తుతం రైతులకు సంబంధించి నటువంటి ఓ చిత్రాన్ని తీస్తున్నానని తొందర్లోనే ఆ చిత్ర వివరాలను తెలియపరుస్తానని అన్నారు.అయితే పూణేలో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు.దాదాపుగా చాలా కాలం తర్వాత సినిమాకి సంబంధించిన వేడుకకు హాజరు కావడం ఇదే తొలిసారి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube