తల్లి రేణు దేశాయ్ కోరిక తీర్చిన అకీరా నందన్.. పవర్ స్టార్ కొడుకంటే ఆ మాత్రం ఉంటుంది?

రేణు దేశాయ్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.డిసెంబర్ 4 రేణుదేశాయ్ పుట్టినరోజు కావడంతో రేణుదేశాయ్ అడిగిన కోరికనూ తన కొడుకు అకీరా నందన్ షేర్ చేశాడు.

 Renu Desai Shares Akira-nandan Piano Playing Video Renu Desai, Tollywood, Akira-TeluguStop.com

అకీరానందన్ గురించి మనందరికీ తెలిసిందే.అఖిరా నందన్ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఒకవైపు ఆటలో మరోకవైపు చదువులో  రెండింటి లోనూ ఫస్ట్ ఉంటాడు.అకీరా సంగీతం మీద పట్టు సాధించాలి అని ప్రయత్నిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది.

ఇటీవలే కూతురు ఆద్య గిటార్ ను ప్లే చేస్తూ పాటలు పాడిన విషయం తెలిసిందే.

ఈ వీడియోని చూసిన పవన్ అభిమానులు పవర్ స్టార్ కూతురా మజాకా అంటూ కామెంట్లు చేశారు.రేణు దేశాయ్ ఇదివరకు అకీరానందన్ పియానో వాయించే వీడియోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరొకసారి అకీరా వాయించే వీడియోని షేర్ చేస్తూ రేణుదేశాయ్ మురిసిపోయింది.రేణు దేశాయ్ తన కొడుకు అకీరా నందన్ నెలరోజుల కిందట ఒక కోరిక కోరిందట.

తనకు ఎంతో ఇష్టమైన పాటను తన బర్త్ డే రోజున పియానో మీద ప్లే చేసి వినిపించమని  అడిగిందట.దీనితో అకీరా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆ పాటను వినిపించాడు.దీనితో తల్లి రేణు దేశాయ్ తన కొడుకుని చూసి మురిసిపోతూ ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇంకొకటి ఉండదు అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.నా జీవితంలో నాకు ఇలాంటి పిల్లలు దొరకడం వరం, అదృష్టం అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యింది.

రేణు దేశాయ్ తన పిల్లలకు సంగీత సరిగమలు నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది.అకీరా నందన్ వీడియోని చూసిన అభిమానులు ఎంతైనా పవర్ స్టార్ తనయుడు కదా ఆ మాత్రం టాలెంట్ ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube