పవర్ స్టార్ కూతురు ఆద్య టాలెంట్ చూస్తే వావ్ అనాల్సిందే!

Renu Desai Shares Aadya Music Palying Video

తెలుగు సినీ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

 Renu Desai Shares Aadya Music Palying Video-TeluguStop.com

ఇక ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో పరిచయం పెరిగి పెళ్లి వరకు వెళ్ళిన సంగతి  తెలిసిందే.  కొన్నీ సంవత్సరాల తరువాత వీరి కాపురానికి బ్రేకులు పడ్డాయన్న విషయం తెలిసిందే .ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.అలాగే సమాజంలో జరిగే పలు విషయాల గురించి స్పందిస్తూ ఉంటారు.

రేణుదేశాయ్ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతోమందికి సహాయాన్ని అందించి తన మంచి మనసు చాటుకున్నారు.కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ఈమె షూటింగ్ లకు దూరం అయ్యింది.

 Renu Desai Shares Aadya Music Palying Video-పవర్ స్టార్ కూతురు ఆద్య టాలెంట్ చూస్తే వావ్ అనాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  ఈక్రమంలోనే డ్రామా జూనియర్స్ షోను కూడా వదిలేసింది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందించడమే కాకుండా, తన కూతురు ఆద్య గురించి, ఆమెకు సంబంధించిన ఫొటోస్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా రేణుదేశాయ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ద్వారా ఆద్య ప్రతిభను అందరికీ పరిచయం చేసింది.ఈ వీడియోలో ఆధ్య గిటార్ వాయిస్తూ పాట పాడుతూ కనిపిస్తోంది.ఆధ్యా టాలెంట్ కి, ఆమె వాయిస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోన్ని  చూసిన పవన్ అభిమానులు పవర్ స్టార్ కూతురా మజాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు మా అన్న పవర్ స్టార్ కూతురు అంటూ, ఇలా వివిధ రకాలుగా ఒక్కొక్కరు ఒకొక్క  శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

#Pawan Kalyan #Music #Aadhya #Aadya #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube