పిల్లలతో స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!  

ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా? అదేనండి మన మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసినదే.

TeluguStop.com - Renu Desai Share Pawan Kalyan With His Child Photo

పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో రేణుదేశాయ్ తో కలిసి నటించి నిజ జీవితంలో ఆమెను వివాహం చేసుకొని స్థిరపడ్డారు.ఎంతో ఆనందంగా ఉన్న వీరికి అకీరా, ఆద్య అనే పిల్లలు కూడా ఉన్నారు.

తరువాత కొద్ది కాలానికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసినదే.

TeluguStop.com - పిల్లలతో స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పవన్ కళ్యాణ్ తో వివాహమైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలను రేణుదేశాయ్ చూసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ తో తన మొదటి భార్య నందినితో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు.అయితే రేణు దేశాయ్ కూడా విడాకులు ఇచ్చి అన్నా లెజ్ నేవా ను మూడో పెళ్లి చేసుకున్నారు.

తన భర్తతో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ మెగా కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ వారి పిల్లలను మాత్రం మెగా కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకు దగ్గర చేస్తుంటారు.తన కూతురు ఆద్యను వరుణ్ తేజ్ తన చెల్లెలు గాని భావించి ఆద్య పుట్టినరోజు వేడుకలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక విషయాల గురించి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న రేణు దేశాయ్ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు.

తాజాగా రేణుదేశాయ్ ఒక ఫోటోను షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకున్నారు.

ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ వడిలో తన ఇద్దరు పిల్లలు తలవాల్చి పడుకున్నారు.ఇంత అందమైన ఫోటోను తానే తీశానని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.తన అభిమాన నటుడు వారి పిల్లలతో దిగిన ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

#Instagram #Adhya #Akira Nandan #Pawan Kalyan #Renu Desai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Renu Desai Share Pawan Kalyan With His Child Photo Related Telugu News,Photos/Pics,Images..