రేణు దేశాయ్ : రేప్ కేసు కన్నా డ్రగ్స్ కేసు ముఖ్యమైందా...?

ఈ మధ్య కాలంలో కొందరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో దేనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో అనే అంశాలను మరిచి ప్రవర్తిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా మనీషా అనే యువతి ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ ఘటన దేశవ్యాప్తంగా ఎంతగానో కలకలం సృష్టించింది.

 Renu Desai Serious On Police And Media About Manisha Murder Case, Renu Desai, Po-TeluguStop.com

 కానీ  మీడియా మరియు పోలీసులు మాత్రం మనీషా అత్యాచార ఘటనని పక్కన పెట్టి బాలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ మాఫియా కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కొందరు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందించింది.

ఇందులో భాగంగా ప్రస్తుతం మీడియా మరియు పోలీసులు మనీషా అత్యాచార ఘటనను పక్కన పెట్టి డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు కి  ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక ఇప్పటికైనా మనీషా అత్యాచార ఘటనను విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె అధికారులను కోరింది.

దీంతో రేణు దేశాయ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో దుమారం రేపుతున్నాయి.

అంతేకాక కొందరు నెటిజన్లు రేణుదేశాయ్ కి తమ మద్దతును తెలియజేస్తున్నారు.

 గతంలో కూడా డా ఓ ఆరు సంవత్సరాలు కలిగినటువంటి చిన్నారి పాప ను గుడిలోని పూజారి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ అదే సమయంలో ఓ సినీ సెలబ్రిటీ మరణించడంతో మీడియా తన దృష్టిని సినీ సెలబ్రిటీ మరణంపై ఉంచిందని ఇది సరికాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరైతే త్వరగా మనీషా అత్యాచార ఘటన కేసును విచారణను పూర్తి చేసి నిందితులను శిక్షించక పోతే సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని కాబట్టి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని లేకపోతే ప్రజలకు కోర్టు న్యాయం పోలీసులు వంటి అంశాల పై నమ్మకం పోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube