విడాకులపై కుండ బద్దలు కొట్టిన రేణు       2018-07-08   01:39:05  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌ను ప్రేమించి చాలా కాలం సహజీవనం సాగించి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్‌ కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. పవన్‌ నుండి రేణుదేశాయ్‌ ఎందుకు విడాకులు తీసుకుంది అనే విషయం క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరిలో ఎవరు విడాకులు కోరారు అనే విషయమై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లుగా ఈ విషయమై నిశబ్దంగా ఉన్న రేణు మరియు పవన్‌లు తాజాగా ఒక క్లారిటీ ఇచ్చేసినట్లయ్యింది. తాజాగా రేణుదేశాయ్‌ రెండవ వివాహానికి సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే ఆమె ఈ విషయమై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

తాను వివాహం చేసుకోబోతున్న వ్యక్తి తరపు కుటుంబ సభ్యులు మరియు తనకు సంబంధించిన వారు అంతా కూడా విడాకుల విషయమై ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు అని, అందుకే తాను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకు ముందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. మీడియాలో తనపై వస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ వచ్చిన రేణుదేశాయ్‌ విడాకులకు గల కారణం ఏంటీ అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆ విషయన్ని ఇప్పుడు చెప్పేసింది. ఇన్నాళ్లుగా తాను నోరు విప్పితే అందరి బాగోతాలు బయటకు వస్తాయని హెచ్చరించిన రేణుదేశాయ్‌ అన్నంత పని చేసి పవన్‌ పరువు తీసినంత పని చేసింది.

తాను 11 సంవత్సరాల పాటు పవన్‌తో కలిసి ఉన్నాను. ఆయనతో తాను ఎంత ఆప్యాయంగా ఉంటున్నప్పటికి ఆయన మరో వ్యక్తితో సహజీవనం సాగించి మరో బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ కారణంతో నేను ఆయనపై కాస్త అసహనం వ్యక్తం చేశాను. ఆ సమయంలోనే ఆయన మనం విడాకులు తీసుకుందాం అంటూ ప్రపోజల్‌ తీసుకు వచ్చాడు. అప్పుడు నేనేం మాట్లాడలేక పోయాను. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించాలనిపించలేదు. ఆ సమయంలో తాను పిల్లల గురించి ఆలోచించి ఆయన నుండి దూరంగా వచ్చి బతికేస్తున్నాను.

ఈ ఎనిమిది సంవత్సరాలుగా తాను ఎంతో మనోవేదనను అనుభవించాను. అయినా కూడా ఏ ఒక్కరిని తాను ఇబ్బంది పెట్టలేదు. విడాకుల సమయంలో భరణం అంటూ కూడా వార్తలు వచ్చాయి. కాని అది కూడా వాస్తవం కాదు అంటూ చెప్పుకొచ్చింది. పవన్‌పై రేణు తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన రాజకీయ మరియు సినీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవ్వడం ఖాయం అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రేణుదేశాయ్‌ తన రెండవ పెళ్లి కోసం పవన్‌ రాజకీయ జీవితాన్ని నాశనం చేసినట్లయ్యిందని కొందరు మెగా ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.