రేణు దేశాయ్‌ ‘పెళ్లి గోల’ సినిమా తీస్తానంటోంది  

Renudesai, Pelli gola Movie, pawan kalyan, Renu desai on her Second Marriage, Mega Fans - Telugu Mega Fans, Pawan Kalyan, Pelli Gola Movie, Renu Desai On Her Second Marriage, Renudesai

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అయిన రేణు దేశాయ్‌ సుదీర్ఘ కాలం పాటు ఒంటరిగా ఉండి ఆమద్య రెండవ పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది.ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Renu Desai Pelli Gola Second Marriage

మీరు పవన్‌ కళ్యాణ్‌ కు మాజీ భార్యగానే ఉండాలి తప్ప మరో పెళ్లి చేసుకోవద్దు అంటూ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్‌ చేశారు.నిశ్చితార్థం అయ్యిందని ప్రకటించిన సమయంలో తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

అయితే ఏ కారణంగానో రేణు దేశాయ్‌ రెండవ పెళ్లి ఇంకా చేసుకోలేదు.

రేణు దేశాయ్‌ ‘పెళ్లి గోల’ సినిమా తీస్తానంటోంది-Movie-Telugu Tollywood Photo Image

ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకుందా లేదంటే త్వరలో పెళ్లి చేసుకుంటుందా అనే విషయంలో ఆమె ఫ్యాన్స్‌ సస్పెన్స్‌గా ఉన్నారు.

చాలా మంది సోషల్‌ మీడియాలో ఆమెను పదే పదే ప్రశ్నిస్తున్నారు.కాని ఎప్పుడు కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని ప్రశ్నించగా దాటవేస్తూ సమాధానం చెప్పింది.నా పెళ్లి గురించి ఎందుకు ఇంతగా ఆతృత అంటూ ఎదురు ప్రశ్నించింది.

నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఒకటే గొడవ చేశారు.ఇప్పుడు మళ్లీ గొడవ చేస్తున్నారు.వీటన్నింటికి ఒక సమాధానంగా పెళ్లి గోల అనే సినిమాను తీస్తానంటూ ఫన్నీగా స్పందించింది.పెళ్లి గోల సినిమా చేస్తే అప్పుడు జనాలకు అన్ని సమాధానాలు లభిస్తాయేమో అంటూ ఈ సందర్బంగా రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది.

మొత్తానికి రేణు దేశాయ్‌ను పెళ్లి విషయంలో నెటిజన్స్‌ చాలా డిస్ట్రబ్‌ చేస్తున్నట్లుగా ఉన్నారు.

#RenuDesai #Pawan Kalyan #Mega Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Renu Desai Pelli Gola Second Marriage Related Telugu News,Photos/Pics,Images..