రేణు దేశాయ్‌ రెండవ పెళ్లి.. వరుడు ఇతడేనా?

చిన్న వయస్సులోనే పవన్‌ కళ్యాణ్‌ను ప్రేమించిన రేణుదేశాయ్‌, ఎవరు చేయని సాహసం చేసింది.పవన్‌పై విపరీతమైన ప్రేమతో ఆయనతో సహజీవనం సాగింది.

 Renu Desai Opens Up On Her Second Marriage-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌తో ఒక సినిమా సమయంలో పరిచయం అయిన రేణుదేశాయ్‌ అప్పటి నుండి కూడా ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని ఫిక్స్‌ అయ్యింది.పవన్‌ కళ్యాణ్‌కు వివాహం ఇష్టం లేకపోయినా కూడా సహజీవనం సాగించేందుకు కూడా రెడీ అంటూ ముందుకు వచ్చింది.

పవన్‌తో సుదీర్ఘ కాలం సహజీవనం సాగించిన రేణుదేశాయ్‌ జీవితం చాలా విభిన్నం అని చెప్పుకోవచ్చు.ఏ మహిళ కూడా ఇంత బాహాటంగా సహజీవనం సాగించిన దాఖలాలు లేవు.

అది కూడా ఒక స్టార్‌ హీరోతో.

రాజకీయ కారణాల వల్ల సహజీవనానికి స్వస్థి పలికి కొడుకు పుట్టిన తర్వాత రేణుదేశాయ్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు వివాహం చేసుకున్నారు.వీరి వివాహం అప్పట్లో సంచనం అని చెప్పుకోవచ్చు.పవన్‌, రేణుల వివాహం తర్వాత పాప జన్మించింది.

వీరి జీవితం హాయిగా, సాఫీగా సాగిపోతున్న సమయంలో ఏం జరిగిందో ఏంటో కాని, ఇద్దరు విడాకులు తీసుకున్నారు.విడాకుల సమయంలో పవన్‌ నుండి భారీ మొత్తంలో భరణంను తీసుకుంది అంటూ రేణుదేశాయ్‌పై విమర్శలు కూడా వచ్చాయి.

ఇక అప్పటి నుండి పవన్‌కు దూరంగా తన సొంత ప్రాంతం అయిన పూణెలో ఉంటున్న రేణుదేశాయ్‌ పిల్లలతో కాలంను గడిపేస్తోంది.

చిన్న వయస్సులోనే భర్తకు దూరం ఉండటం, భర్త లేకుండా ఉండటం కష్టం అంటూ అప్పుడప్పుడు ట్వీట్స్‌ చేస్తూ వచ్చిన రేణు దేశాయ్‌ ఆమద్య రెండవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా పోస్ట్‌ చేసింది.

రేణు పోస్ట్‌కు మెగా ఫ్యాన్స్‌ సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు.మీరు ఎప్పటికి పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగా ఉండాలని వారు డిమాండ్‌ చేశారు.పెళ్లి అంటూ చేసుకుంటూ కఠినంగా వ్యవహరిస్తాం అంటూ ఆమెను సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ట్రోల్‌ చేయడం జరిగింది.అయినా కూడా రేణుదేశాయ్‌ ఏమాత్రం భయపడకుండా తాను అనుకున్నది చేస్తాను, మీరు ఏం చేయాలనుకున్నా చేయండి అంటూ వ్యాఖ్యలు చేసింది.

తాజాగా చెప్పినట్లుగానే త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి చేయిని పట్టుకుని ఉన్న ఫొటోను రేణు పోస్ట్‌ చేశారు.ఆ ఫొటో మొత్తం స్టోరీని చెప్పేస్తుంది.ఎప్పటికి నా చేయి ఇలాగే పట్టుకుని ఉండు అంటూ రేణు చేసిన వ్యాఖ్య అందరిని కలచి వేసింది.

ఆమద్య తనను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అని, సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ చేస్తున్న ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, కాని నేను ఒక నిర్ణయంను తీసుకోలేక పోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.ఇప్పుడు అదే వ్యక్తితో రేణుదేశాయ్‌ పెళ్లికి రెడీ అవుతుంది.

ఈ సమయంలో పవన్‌, రేణులకు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే వారు కాస్త పెద్ద వారు అయ్యారు కనుక ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube