మాస్ రాజా పాన్ ఇండియా సినిమాలో పవన్ మాజీ భార్య!

మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

 Renu Desai In Ravi Teja Pan India Movie, Director Vamsi Krishna, Mass Maharaja Raviteja, Renu Desai, Tiger Nageswararao, Tollywood , Tollywood News-TeluguStop.com

రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.

ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

 Renu Desai In Ravi Teja Pan India Movie, Director Vamsi Krishna, Mass Maharaja Raviteja, Renu Desai, Tiger Nageswararao, Tollywood , Tollywood News-మాస్ రాజా పాన్ ఇండియా సినిమాలో పవన్ మాజీ భార్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ‘ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతుంది.

ఆ తర్వాత వరుసలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమా ఉంది.ఇక వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘, అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను చేస్తున్నాడు.

ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.1970 స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తుంది.

Telugu Vamsi Krishna, Massmaharaja, Renu Desai, Renudesai, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఇందులో కీలక పాత్ర కోసం పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.రవితేజ సోదరి కోసం రేణు దేశాయ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.జానీ సినిమా తర్వాత ఈమె నటనకు దూరం అయ్యారు.ఈ మధ్యనే ఆధ్య అనే వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టిన రేణు దేశాయ్ రవితేజ సినిమాలో నటిస్తుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube