పవన్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య...  

Renu Desai Have Clarity About Pawan Kalyan Movie - Telugu Pawan Kalyan Latest News, Pawan Kalyan News, Renu Desai, Renu Desai Movie Latest News, Renu Desai New Movie, Renu Desai News, Tollywood

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయిన పవన్ కళ్యాణ్.అయితే మూడేళ్ల కాలం తర్వాత బాలీవుడ్లో మంచి విజయం సాధించినటువంటి పింక్ ఈ చిత్రాన్ని తెలుగులో లాయర్ సాబ్ అనే టైటిల్ తో రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Renu Desai Have Clarity About Pawan Kalyan Movie

అయితే ఈ చిత్రానికి దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో ఈ చిత్రం గురించి కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇందులో ముఖ్యంగా పవన్ నటిస్తున్నటువంటి చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తున్నట్లు పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అంతేగాక రేణు దేశాయ్ పవర్ ఫుల్ లేడీ లాయర్  పాత్రలో నటిస్తోందని ఇందుకు సంబంధించి భారీ రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పష్టత ఇచ్చింది.

తాజాగా రేణు దేశాయ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోని షేర్ చేసింది.దీంతో ఓ అభిమాని వదినమ్మ మీరు పవన్ కళ్యాణ్ అన్న నటిస్తున్నటువంటి పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారని కొందరు అంటున్నారు నిజమేనా అని అడిగాడు.

దీంతో రేణుదేశాయ్ స్పందిస్తూ “లేదండి అవన్నీ ఫాల్స్ న్యూస్” అంటూ సమాధానం ఇచ్చింది.దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలో రేణుదేశాయ్ నటిస్తుందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

అయితే ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఒక పక్క పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తూనే మరొక ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న టువంటి మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి లాయర్ సాబ్ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు శ్రీరామ్ వేణు ఏర్పాట్లు చేస్తున్నాడు.

తాజా వార్తలు

Renu Desai Have Clarity About Pawan Kalyan Movie-pawan Kalyan News,renu Desai,renu Desai Movie Latest News,renu Desai New Movie,renu Desai News,tollywood Related....