పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రది సినిమాలో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన బెంగాలీ బ్యూటీ రేణు దేశాయి, ఆ తరువాత పవన్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే.కొన్నాళ్ల పాటు ప్రేమజీవితం కొనసాగించిన వారిద్దరు, పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకున్నారు.
పవన్ నుండి విడిపోయిన తరువాత రేణు ఒంటరిగానే జీవిస్తోంది.అయితే తాను కూడా మళ్లీ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తానంటూ రేణు గతంలో చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడిన విషయం తెలిసిందే.
కాగా రేణు దేశాయ్ ఎవ్వరికీ తెలియకుండా మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.దీనికి బలం చేకూర్చే సాక్ష్యాన్ని కూడా ఆమె తన వెంట పెట్టుకుంది.
రేణు గతకొద్ది రోజులుగా మెడలో ఓ నల్లపూసల దండను ధరించి ఉండటంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందా అనే సందేహం అందరిలో మొదలైంది.కాగా గతంలో తన మనసుకు నచ్చిన వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్నట్లు రేణు చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
మొత్తానికి పవన్ నుండి విడిపోయిన తరువాత రేణు దేశాయ్ మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఆలోచించడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెట్టినట్లు తెలుస్తోంది.మరి రేణు వివాహం విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె అఫీషియల్‌గా ప్రకటించే వరకు ఆగాల్సిందే.