మేజర్ సినిమాలో తాను నటించడం లేదన్న రేణు దేశాయ్  

Renu Desai Gives Clarity On Mahesh Babu Movie - Telugu Indian Cinema,, South Cinema, Telugu Cinema, Tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలో దీనికి సంబందించిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

 Renu Desai Gives Clarity On Mahesh Babu Movie

అయితే తాజాగా ఈ వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ ఈ విషయంపై ఆమె స్పష్టత ఇచ్చింది.

ఇప్పటి వరకు ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అని అన్నారు.గత రెండు మూడు రోజులుగా తనకు చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని, ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు.

మేజర్ సినిమాలో తాను నటించడం లేదన్న రేణు దేశాయ్-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె, మహేశ్ బాబుతో సినిమాకు, తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు.ఇంత పెద్ద చిత్రంలో తనకు నటించే అవకాశం వస్తే, తానే ప్రకటన చేసుండేదాన్నని, తనకు కూడా నటించాలని ఉందని, గతంలో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు అంగీకారం తెలిపానని, దాని ఆధారంగానే ఈ తప్పుడు రూమర్ ఉండొచ్చని పేర్కొంది.

అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test