ఆ మెసేజ్ లు పంపకండి అని మండిపడ్డ రేణు దేశాయ్..

ప్రస్తుతం కోవిడ్ దేశాన్ని గడగడలాడిస్తోంది.దీంతో పాటు మరో వైపు బ్లాక్ ఫంగస్ ముప్పు కూడా దూసుకువస్తుంది.

 Renu Desai Fires On Netizens, Renu Desai, Tollywood, Fires Netizens, Black Fungu-TeluguStop.com

దేశంలో లాక్ డౌన్ విధించినా కూడా.కేసులు మాత్రం తగ్గట్లేదు.

మరణాల సంఖ్య పెరుగుతుంది.సరైన ఆక్సిజన్, ప్లాస్మా వంటివి దొరకడం కష్టమవుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఆక్సిజన్, ప్లాస్మా వంటి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా మరో తెలుగు సినీ నటి రేణు దేశాయ్ కోవిడ్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

గత కొన్ని రోజుల నుండి తన వంతు సహాయంగా లైవ్ లో పాల్గొంటుంది.అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో బ్లడ్, ఆక్సిజన్ గురించి ప్రకటనలు ప్రతిరోజు షేర్ చేసుకుంటూనే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ నెటి జనుల పై తీవ్రంగా మండిపడింది.

ప్రతిరోజు రేణు దేశాయ్ తన సమయాన్ని లైవ్ ద్వారా అందిస్తుంది.

ఈ క్రమంలో ఎవరికైనా ఏదైనా సహాయం కావడానికి మెసేజ్ లు చేయండి అంటూ తెలిపింది.కానీ నెటి జనులు తనకు హాయ్, హలో వంటి మెసేజ్ లు పంపిస్తున్నారు.

దీంతో వాళ్లు పంపించే మెసేజ్ లకు.తనని సాయం కోరే వాళ్ళు చేసిన మెసేజ్ లు కిందికి వెళ్లిపోవడంతో.ఆ మెసేజ్ లు చూడటానికి ఇబ్బంది అవుతుందని తెలిపింది.దీంతో చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సహాయం అందించక పోవడంతో కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.

అంతేకాకుండా తాను ప్రస్తుతానికి ఎవరికి ఆర్థిక సహాయం చేయలేనందున.అనారోగ్యానికి గురైనవారికి ఆస్పత్రులు, మందులు విషయాలలో చేతనైనంత సహాయం చేస్తున్నానని తెలిపింది.ఇకనైనా మారండి అంటూ.దయచేసి నాకు సరదా మెసేజ్ లు పెట్టకండి అని కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube