కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న రేణు దేశాయ్‌

హీరోయిన్‌గా కంటే పవన్‌కళ్యాణ్‌ భార్యగా తెలుగు వారికి సుపరిచితురాలు అయిన రేణు దేశాయ్‌ చేసింది చాలా తక్కువ సినిమాలే.ఈ అమ్మడు ‘జానీ’ చిత్రం తర్వాత మళ్లీ వెండితెరపై దర్శణం ఇవ్వలేదు.

 Renu Desai Doing Telugu Ad For Telugu People On Kalamandir Sarees-TeluguStop.com

పవన్‌తో ప్రేమాయాణం, సహజీవనం, పిల్లలు ఆ తర్వాత పెళ్లి ఇలా సాగుతున్న సమయంలో పవన్‌తో విడాకులు.దాంతో సినిమాల ద్వారా కాకున్నా పవన్‌ మాజీ భార్యగా రేణుకు ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ ఉంది.

ఈ అమ్మడు ఇతర భాషల్లో నిర్మాతగా వ్యవహరిస్తూ తన కెరియర్‌ను అలాగే లాగుతోంది.

తాజాగా రేణు మరోసారి కెమెరా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.అయితే అది సినిమాలో కాదు.ఒక యాడ్‌ ద్వారా రేణు కెమెరా ముందుకు వచ్చింది.

కళామందిర్‌ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు రేణు ఇటీవలె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్‌ను ఈ అమ్మడు ప్రమోట్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.

రేణుకు ఉన్న ఫాలోయింగ్‌ వల్లనే కళామందిర్‌ వారు రేణును ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ యాడ్‌ కనుక సక్సెస్‌ అయితే రేణుకు మరిన్ని బ్రాండ్స్‌ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.పవన్‌ మాజీ భార్యగా క్రేజ్‌ ఉన్న రేణు మళ్లీ ఫాంలోకి రావాలని చిన్నగా ఇలా యాడ్‌ ద్వారా తళుక్కుమనబోతుంది కాబోలు.త్వరలోనే వెండితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వనుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటే ఇక సినిమాల్లో ఆఫర్లు వస్తే వాటిని కూడా ఒకే చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube