మరోసారి బుల్లి తెరపై సందడి చేయబోతున్న పవన్‌ మాజీ భార్య  

Renu Desai Comes In Dhee Finall -poorna,priyamani,renu Desai,renu Presnt Suffering From Fever,shekar Master,tollywood

పవన్‌ కళ్యాణ్‌ మాజీ బార్య రేణు దేశాయ్‌ ఆమద్య స్టార్‌ మా లో ప్రసారం అయిన ఒక డాన్స్‌ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే.ఆ షో పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో తర్వాత సీజన్‌లు కొనసాగలేదు.అప్పుడప్పుడు రేణు దేశాయ్‌ తెలుగు బుల్లి తెరపై కనిపిస్తూనే ఉంది.కాని రెగ్యులర్‌గా మాత్రం ఆమె కనిపించడం లేదు.తాజాగా మరోసారి రేణు దేశాయ్‌ బుల్లి తెర ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దం అయ్యింది.

Renu Desai Comes In Dhee Finall -poorna,priyamani,renu Desai,renu Presnt Suffering From Fever,shekar Master,tollywood-Renu Desai Comes In Dhee Finall Episode-Poorna Priyamani Renu Presnt Suffering From Fever Shekar Master Tollywood

ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షో ద్వారా రేణు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Renu Desai Comes In Dhee Finall -poorna,priyamani,renu Desai,renu Presnt Suffering From Fever,shekar Master,tollywood-Renu Desai Comes In Dhee Finall Episode-Poorna Priyamani Renu Presnt Suffering From Fever Shekar Master Tollywood

రేణు దేశాయ్‌ తాజాగా ‘ఢీ’ షూటింగ్‌లో పాల్గొంది.ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెళ్లడించింది.త్వరలోనే ఆ షో ప్రసారం కాబోతుంది.శేఖర్‌ మాస్టర్‌, ప్రియమణి ఇంకా పూర్ణలు ఈ సీజన్‌కు మొత్తం జడ్జ్‌లుగా వ్యవహరించిన విషయం తెల్సిందే.

ఈ సీజన్‌ ముగింపు దశకు చేరుకున్న ఈ సమయంలో రేణు దేశాయ్‌ని తీసుకు వచ్చేందుకు షో నిర్వాహకులు సిద్దం అయ్యారు.సౌత్‌ ఇండియాలో బిగ్గెస్ట్‌ డాన్స్‌ షో అంటూ ఢీ కు మంచి గుర్తింపు ఉంది.

అందుకే ఈ షోలో పాల్గొనేందుకు రేణు దేశాయ్‌ ఒప్పుకున్నారు.

గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్‌ డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నారు.ఆ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెళ్లడించారు.డెంగ్యూ వల్ల తాను పడుతున్న బాధను ఆమె వెళ్లడించింది.మీ పిల్లలను దోమల బారి నుండి కాపాడండి.చాలా జాగ్రత్తగా వారిని చూసుకోండి అంటూ రేణు సలహా ఇచ్చింది.డెంగ్యూ ఫీవర్‌ ప్రస్తుతం కాస్త తగ్గిందని, ఆ డెంగ్యూ ఫీవర్‌తోనే ‘ఢీ’ షో చేసినట్లుగా తెలుస్తోంది.వచ్చే వారంలో రేణు దేశాయ్‌ పాల్గొన్న షో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.