దొంగ బయోపిక్ లో రేణు దేశాయ్ ఫిక్స్  

Renu Desai Charecter Finilized In Tiger Biopic-

బద్రి సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ తరువాత జానీ సినిమాలో కనిపించి యాక్టింగ్ కెరీర్ ను దూరం పెట్టేశారు.కాస్ట్యూమ్ డిజైనర్ గా డైరెక్టర్ గా ఎడిటర్ గా కొనసాగిన ఆమె ఇన్నాళ్లకు మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు.

Renu Desai Charecter Finilized In Tiger Biopic--Renu Desai Charecter Finilized In Tiger Biopic-

ఈ విషయంపై గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్నప్పటికీ అఫీషియల్ గా ఎవరు ఎనౌన్స్ చేయలేదు.

Renu Desai Charecter Finilized In Tiger Biopic--Renu Desai Charecter Finilized In Tiger Biopic-

అయితే ఈ విషయంపై మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర వివరణ ఇచ్చారు.టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ కోసం ఆయన మాటలను రాశారు.స్క్రిప్ట్ పనులన్నీ అయిపోయాయి.త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని అయితే సినిమాలో రేణు దేశాయ్ కోసం ఒక పాత్రను అనుకున్నట్లు చెప్పారు.

సినిమాలో స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించనున్నాడు.

అయితే రేణు దేశాయ్ నటిస్తున్నారని చెప్పిన సాయి మాధవ్ ఆమె ఏ పాత్రలో నటిస్తున్నారన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.హీరో అక్క పాత్రలో ఆమె కనిపించే అవకాశం ఉందని గతంలో రూమర్స్ అయితే వచ్చాయి, ఇక త్వరలోనే ఆమె పాత్రపై క్లారిటీ వస్తుందని సాయి మాధవ్ అన్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆ సినిమాకు వంశీ కృష్ణ దర్శకుడు.