పవన్‌, నేను మంచి తల్లిదండ్రులం  

Renu Desai About Her Children Caring-

English Summary:Pawan Kalyan, renudesay long ago received a steady couple is split. The court granted the couple divorce.The break up of their grown children without parental deficit. Each day for the kids and talking to them, looking them from time to time needs to be grown in a good way.Renu Desai said the same thing recently. He is also a child's future padakudadane Pawan break with the intention that they untunnamani good friends, together, every day, even on the phone, talking about the child claimed carcincukuntamani dust.Twitter recently, Pawan Kalyan is not a good father kamentku response to Renu Desai claimed. Staying with friends for a child rarely'll be looking for a steady couple split.It Pawan Kalyan and Renu Desai said, is believed to pavanijam. Anninta Pawan fans happy is to be the best.......

పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ చాలా కాలం క్రితమే భార్యభర్తలుగా విడిపోయిన విషయం తెల్సిందే. వీరిద్దరికి అప్పుడే కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరు విడిపోయినా కూడా పిల్లలకు తల్లిదండ్రుల లోటు లేకుండా పెంచుతున్నారు. పిల్లల కోసం ప్రతీ రోజు మాట్లాడుకుంటూ, వారికి కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ వారిని మంచి మార్గంలో పెంచుతున్నారు. ఇదే విషయం తాజాగా రేణు దేశాయ్‌ ప్రకటించింది.

తాను, పవన్‌ విడిపోయినా కూడా అది పిల్లల భవితవ్యంపై పడకూడదనే ఉద్దేశ్యంతో తామిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటున్నామని, ఇద్దరం కలిసి లేకున్నా కూడా ప్రతీ రోజు ఫోన్‌లో మాట్లాడుతూ పిల్లల గురించి చర్చించుకుంటామని రేణు చెప్పుకొచ్చింది. తాజాగా ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఒక మంచి తండ్రి కాదు అన్న కామెంట్‌కు సమాధానంగా రేణు దేశాయ్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. పిల్లల కోసం విడిపోయిన భార్యభర్తలు స్నేహితుల్లా కలిసి ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అది పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌లకు చెందింది అంటున్నారు పవనిజం నమ్మేవారు. అన్నింట పవన్‌ బెస్ట్‌ అంటూ ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.