ఏదేదో ఊహించుకోకండి అంటున్న రేణు దేశాయ్.. ఎందుకంటే?

తెలుగు సినీ నటి రేణు దేశాయ్.నటిగా కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.

 Renu Desai About Akira Nandan Entry-TeluguStop.com

ఇక ఈమె మొదట జేమ్స్ పాండు అనే తమిళ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది.ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఇక ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో పరిచయం పెరిగింది.

 Renu Desai About Akira Nandan Entry-ఏదేదో ఊహించుకోకండి అంటున్న రేణు దేశాయ్.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


ఆ తర్వాత వారిద్దరి మధ్య సహజీవనం జరుగగా ఆ తర్వాతే 2003లో జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించింది.

ఇంకా 2004లో పెళ్లికి ముందే వీరికి అకీరా నందన్ పుట్టాడు.ఇక ఆ తర్వాత 2009లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇక వీరికి ఆద్య పుట్టగా.కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇక రేణూ మరో వివాహం చేసుకోకుండా తన ఇద్దరు పిల్లలతో గడుపుతుంది.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే రేణుదేశాయ్ తన పిల్లల గురించి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా వారి ఫోటోలను కూడా తెగ పంచుకుంటుంది.

ఇక తాజాగా అడవి శేష్ మేజర్ టీజర్ లో పాల్గొనగా.అక్క తన ఇద్దరు పిల్లలు, అడివి శేష్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.

తమ కుటుంబానికి అడవి శేష్ తో మంచి సంబంధం ఉందని పలు సందర్భాల్లో రేణూ తెలిపింది.


ఇదిలా ఉంటే తను షేర్ చేసిన ఫోటోలో అకీరా మాస్క్ ధరించుకోగా.

నెటిజనులు మాస్క్ లేకుండా అకీరా ఫోటోలు పెట్టమని కోరారు.దీంతో సోషల్ మీడియాలో తన ఫోటోలను పెట్టడం అకీరాకు సిగ్గు అని తెలిపింది రేణూ.

ఇక ఇలాంటి పరిస్థితిలో అకీరా లాంటి కొడుకులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు.


ఇదిలా ఉంటే అడవి శేష్ తో ఉన్న ఫోటో గురించి ఓ నెటిజన్ అకీరా మేజర్ సినిమాలో నటిస్తున్నాడా? అని ప్రశ్నించగా.లేదు మీరు ఏది ఊహించుకోకండి అంటూ అంతేకాకుండా ప్రచారం చేయకండి అంటూ రేణుదేశాయ్ తెలిపింది.ఒకవేళ అకీరా నటన మొదలుపెడితే నేనే ముందు మీతో షేర్ చేసుకుంటాను అని స్పందించింది.

ఇక అకీరా కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా రావడంతో తన కామెంట్లను టర్న్ ఆఫ్ చేసింది.

#Adivi Sesh #Renu Desai #Akira Nandan #Pawan Son #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు