లక్కీ లేడి: వంద రూపాయల తో రాత్రికి రాత్రి కోటీశ్వరురాలు అయిన మహిళ..!

అదృష్టమనేది మనిషికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు.కొన్ని సార్లు ఎంత కష్టపడిన ఫలితం దక్కదు కొందరికి అందుకే అంటుంటారు.

 Lucky Lady A Woman Who Is A Millionaire In A Night With Hundred Rupees,  Lottery-TeluguStop.com

ఆవగింజ అంతయినా ఆదృష్టం ఉండాలి అంటారు.అది కొందరి విషయంలోనే నిజం అని నిరూపితమైంది.తాజాగా ఓ మహిళ రూ.100 పెట్టి విలువ చేసే ఒక లాటరీని రేణు కొనుగోలు చేసింది.ఆమెకు అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరాలు అయ్యింది.

అయితే ఆమె ఒక సాధార‌ణ గృహిణి.

ఆమె భ‌ర్త చిన్న దుస్తుల దుకాణం న‌డిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు.రోజూ క‌ష్ట‌ప‌డితే గానీ వారి ఇల్లు గ‌డ‌వ‌ని పరిస్థితి.

అలాంటి ఓ మహిళ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది.అదృష్టం ఆమె తలుపుతట్టింది.

కట్‌ చేస్తే ఆమె రాత్రిరాత్రే కోటీశ్వ‌రురాలిగా మారింది.వంద రూపాయ‌లు పెట్టి ఆమె కొన్న టికెట్‌ కు కోటి రూపాయ‌ల లాట‌రీ తగలడంతో సాధారణ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది.

ఈ ఘ‌ట‌న పంజాబ్‌ లోని అమృత్‌ స‌ర్‌ లో చోటు చేసుకుంది.

Telugu Rs, Amritsar, Prize, Lottery, Punjab, Renu Chowhan, Latest-Latest News -

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌ స‌ర్‌ కి చెందిన రేణూ చౌహాన్ 100 రూపాయ‌ల‌తో ఇటీవల ప్రభుత్వానికి చెందిన ఓ లాట‌రీ టికెట్‌ను కొనుగోలు చేసింది.ఆ లాట‌రీకి సంబంధించిన డ్రాను అధికారులు ఫిబ్ర‌వ‌రి 11న తీశారు.

ఆ డ్రాలో రేణూ కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్ D-12228‌కు మొద‌టి బ‌హుమ‌తి త‌గిలింది.దీంతో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం రేణూ చౌహాన్‌ను విజేత‌గా ప్ర‌క‌టించింది.

ప్రైజ్ మనీ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్ల‌ను రాష్ట్ర లాట‌రీస్ శాఖలో రేణూ గురువారం స‌మ‌ర్పించింది.త్వరలోనే ఆమెకు కోటి రూపాయల నగదు చేరుతుందని రాష్ట్ర లాటరీ శాఖ అధికారి వెల్లడించారు.

ఈ సందర్భంగా రేణూ చౌహాన్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది.లాటరీ డాక్యుమెంట్లను సమర్పించిన అనంతరం రేణూ చౌహాన్ మాట్లాడుతూ.భ‌గ‌వంతుడి ఆశీస్సుల‌తోనే త‌న‌కు లాట‌రీ త‌గిలింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.త‌మ కుటుంబం సంతోషంగా జీవించేందుకు ఈ నగదు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆమె వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube