విడ్డూరం : ఇతడికి వచ్చిన చిలిపి ఆలోచనతో లక్షలు సంపాదిస్తున్నాడు, ఎలాగో తెలుసా?

అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించేవాడే ప్రస్తుత పోటీ సమాజంలో నెగ్గుకు రాగలడు అంటూ మన చుట్టు ఉన్న వారిని చూస్తే అర్థం అవుతుంది.చలికాలంలో ఐస్‌ క్రీమ్‌ అమ్మాలనుకునేవాడు అదే స్థాయిలో ఉంటాడు.

 Renta Boyfriendservice App Launched In India-TeluguStop.com

కాని ఏ కాలంకు ఆ వ్యాపారం చేసేవాడు మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్తాడు.ప్రస్తుతం జనాలకు కావాల్సింది అందించినప్పుడు అది నీ వద్ద మాత్రమే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాపారం చాలా హై రేంజ్‌కు వెళ్తుంది.

ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి రెండవ రంకు చెందిన వాడు.అవతలి వారి అవసరాలను క్యాష్‌ చేసుకుంటూ బిజినెస్‌ స్టార్ట్‌ చేశాడు.

Telugu Boyfriend, India, Kaushalprakash, App Launched, Boyfriendapp, Telugu-Gene

కౌశల్‌ ప్రకాష్‌ అనే వ్యక్తి ఒక సామాన్య కుర్రాడు.అతడికి వచ్చిన ఒక చిలిపి ఆలోచన వదిలేయకుండా ప్రయత్నిద్దాం అనుకుని మొదలు పెట్టాడు.రెంట్‌ ఏ బాయ్‌ ఫ్రెండ్‌ యాప్‌ను మొదలు పెట్టాడు.అతడి యాప్‌ను చూసి స్నేహితులు కొందరు నవ్వుకున్నారు.కొందరు ఆసక్తి చూపించి తాము కొంత డబ్బు పెడతామంటూ ముందుకు వచ్చారు.కాని అతడికి ఆ సమయంలో డబ్బు అక్కర్లేదు.

జస్ట్‌ యాప్‌ను క్రియేట్‌ చేసి పెట్టాడు.దానికి వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆశ్చర్య పోయాడు.

ఆ యాప్‌లో అమ్మాయిలకు అబ్బాయిలను అరేంజ్‌ చేయడం ద్వారా డబ్బును తీసుకోవడం మొదలు పెట్టాడు.

Telugu Boyfriend, India, Kaushalprakash, App Launched, Boyfriendapp, Telugu-Gene

సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అంటే అయిదు వేల రూపాయల నుండి అయిదు వందల రూపాయల వరకు కూడా ఈ యాప్‌లో కుర్రాళ్లు లభిస్తారు.ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బుక్‌ చేసుకునే వెసులు బాట్లు ఉన్నాయి.ప్రస్తుతం ప్రతి రోజు 200 నుండి 250 వరకు ఆర్డర్లు వస్తున్నట్లుగా కౌశల్‌ చెబుతున్నాడు.

ఇది ఇల్లీగల్‌ అయినా కూడా అతడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వ్యవహారం సాగిస్తున్నాడు.ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాని ప్రస్తుతానికి తాను ఆర్థికంగా బాగున్నాను.అలాగే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ అమ్మాయిలు నా యాప్‌ వల్ల సుఖ పడుతున్నారు అంటున్నాడు కౌశల్‌.ఇతడు చేసేది తప్పు కాదని కొందరు అంటే మరికొందరు మాత్రం పురుషులతో ఇతడు వ్యభిచారం చేయిస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరి మీ అభిప్రాయం ఏంటీ మాతో షేర్‌ చేసుకోండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube