ఆ ప్రాంతంలో ఇళ్లకు అద్దె కట్టాల్సిన అవసరం లేదు.. ఎక్కడంటే..?!

అమెరికా దేశం.కాలిఫోర్నియా రాష్ట్రం.

 No Need To Pay Rent At Slab City, Slab City, America, Rent Free Houses-TeluguStop.com

సొనోరన్ అనే ఓ ఎడారిలో ఒక సిటీ ఉంది.ఈ సిటీ లో ఏ దేశానికి చెందిన ప్రజలైనా నివసించవచ్చు.

ఈ సిటీ లోకి ప్రవేశించాలంటే శాండియాగో నుంచి ఈశాన్యంగా దాదాపు 240 కిలోమీటర్లు వెళ్లాలి.అయితే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు కాలిఫోర్నియా ప్రభుత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు.

అందుకే దీనిని ‘ద లాస్ట్ ఫ్రీ ప్లేస్ ఇన్ అమెరికా’ అని పిలుస్తుంటారు.కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంత ప్రజలకు కరెంటు, నీరు వంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించదు.

ఇంకో విశేషం ఏంటంటే.పైసా కూడా రెంట్ చెల్లించకుండా ఈ సిటీలో ఉండే చిన్న ఇళ్ళల్లో ఎన్ని రోజులైనా నివసించవచ్చు.ఈ సిటీ ని స్లాబ్ సిటీ అంటారు.ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా స్లాబ్ తో నిర్మించిన చిన్న ఇల్లులు కనిపిస్తాయి.

ఇది పేరుకి సిటీ అయినా కూడా మిగతా సిటీల్లో లాగా పక్కపక్కనే ఇరుకుఇరుకుగా ఇళ్ళు ఎక్కడా కనిపించవు.ఆ సిటీలో ఇళ్ళ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది.

మెక్సికన్ బోర్డర్ నుంచి గంట ప్రయాణం చేస్తే ఈ స్లాబ్ సిటీని చేరుకోవచ్చు.

Telugu America, Pay Slab, Houses, Slab-Latest News - Telugu

ప్రస్తుతం ఈ సిటీ లో 150 మంది కుటుంబాలు ఉంటున్నాయి.వీరంతా కూడా సోలార్ ఎనర్జీ, జనరేటర్ల పైన వారు ఆధారపడుతుంటారు.గ్యాసోలిన్ తో పాటు మిగతా నిత్యావసర సరుకులు కోసం సమీపంలో ఉన్న నైలాన్ సిటీకి వెళ్తుంటారు.1942లో సోనోరన్ ఎడారిలో అమెరికన్ ఆర్మీ అధికారులు 600 ఎకరాల్లో యు.ఎస్.మెరైన్ కార్ప్స్ స్థావరం ఏర్పరుచుకున్నారు.ఈ సమయంలోనే వారు సుమారు 30 నిర్మాణాలు, 8.2 మైళ్ళు (13.1 కిలోమీటర్లు) రహదారి నిర్మించారు.రెండో ప్రపంచ యుద్ధం 1945 లో ముగిసిన తర్వాత అమెరికన్ రక్షణ శాఖ అధికారులు 1961 లో సోనోరన్ ఎడారి ని కాలిఫోర్నియా రాష్ట్రానికి తిరిగి ఇచ్చేసారు.తదనంతరం అక్కడి సైనిక భవనాలు కూల్చివేయబడ్డాయి.

ప్రస్తుతం అక్కడ కాంక్రీట్ స్లాబ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.అందువల్ల, ఈ ప్రాంతానికి తరలి వచ్చేవారు దీనిని స్లాబ్ సిటీగా పేర్కొనడం ప్రారంభించారు.

ఇక్కడ ఎక్కువగా కళాకారులు నివసిస్తుంటారు.ఏది కనిపించినా వారు రంగులతో వాటిని చాలా ఆకర్షణీయంగా మార్చేస్తుంటారు.

టూరిస్టులు వచ్చినప్పుడు కూడా వారు తమ ప్రతిభను చూపించి స్లాబ్ సిటీ యొక్క అందాలను వివరిస్తుంటారు.అలాగే టూరిస్టులు ఇచ్చిన డబ్బులతో సరుకులు కొని తెచ్చుకుంటారు.

ఏది ఏమైనా ఎటువంటి రూల్స్ పాటించకుండా, వేలల్లో రెంట్ కట్టకుండా స్లాబ్ సిటీ వాసులు తమ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube