వెబ్ సిరీస్ లో నటించే హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో తెలుసా?

అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, జీ5 ఒకటేమిటీ ప్రస్తుతం పలు రకాల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల హవా కొనసాగుతోంది.ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ చేరడంతో ఓటీటీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

 Remunerations Of Ott Heroines In Web Series, Heroines, Ott, Webseries, Amazon Pr-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆయా ఓటీటీలు సొంతంగా వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి.సొంత నిర్మాణ సంస్థల ద్వారా లేదంటే ఆయా కంపెనీలు రూపొందించిన వెబ్ సిరీస్ లను కొనుగోలు చేస్తున్నాయి.

ప్రస్తుతం అన్ని ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి.తక్కువ ఖర్చుతో ఎక్కువ లెన్త్ సిరీస్ లు రూపొందిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

వీటి ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

అటు ఓటీటీ జమానాలో చిన్న హీరోయిన్లు, పెద్ద హీరోయిన్లు, హీరోలు, బడా నిర్మాతలంతా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు.

తక్కువ సమయంలో రూపొందడం, తక్కువ డేట్స్ అవసరం ఉండంటంతో పాటు మంచి పారితోషికం వస్తుండంతో హీరో, హీరోయిన్లు వెబ్ సిరీస్ లు చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.అయితే వెబ్ సిరీస్ బడ్జెట్, హీరోయిన్స్ తీసుకునే రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది అనే విషయంపై జనాలకు ఎక్కువగా అవగాహణ లేదు.

ఇంతకీ అవి ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Amazon Prime, Hot, Dates, Netflix, Crore Rupees, Ott Trend, Zee-Movie

వెబ్ సిరీస్ లలో పాటలు ఉండవు.తక్కువ డేట్స్ సరిపోతాయి.అటు పారితోషికం కూడా రోజు వారీగా ఇస్తారు.

చాలా వరకు ఇలాగే ఉంటుంది.హీరోయిన్ల హోదాను బట్టి పారితోషికం అనేది నిర్ణయిస్తారు.

కొంత మంది హీరోయిన్స్ అయితే రోజు వారీ రెమ్యునరేషన్ కాకుండా వెబ్ సిరీస్ కు ఇంత అని మాట్లాడుకుంటారు.ఎక్కువ శాతం హీరోయిన్లు మాత్రం రోజు వారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సినిమాకు కోటి రూపాయలు తీసుకునే హీరోయిన్.వెబ్ సిరీస్ లో అయితే 20 నుంచి 30 లక్షలు తీసుకునే అవకాశం ఉంది.

డేట్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తే ఈ లెక్క కాస్త మారిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube