తగ్గేదేలే అంటున్న ఐదుగురు భామలు.. నిర్మాతలకు చుక్కలు చుపిస్తున్నారుగా..

సౌత్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది అనే విషయం తెలిసిందే.మన సినిమాలు ఇంట బయట దుమ్ములేపుతున్నాయి.

 Remuneration Of South Indian Actress, South Indian Actress, Remuneration , Tolly-TeluguStop.com

బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ ను బెంబేలెత్తిస్తున్నాయి.దీంతో సౌత్ స్టార్స్ భారీగా పారితోషికం పెంచేస్తున్నారు.

ఏ స్టార్ ను కదిలించిన 50 కోట్లకు పైమాటే చెబుతున్నారు.దీంతో హీరోయిన్స్ కూడా తాము ఏం తక్కువ కాదు అని పెంచేశారు.

మరి మన సౌత్ లో అగ్ర కథానాయికల్లో ఈ ఐదుగురు పారితోషికం అయితే నిర్మాతలకు చుక్కలు కనిపించేలా చేస్తుంది.మరి ఆ ఐదుగురు ఎవరు? ఎంత పుచ్చుకుంటున్నారు? అనేది తెలుసుకుందాం.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.లేడీ సూపర్ స్టార్ గా సినిమాకు 10 కోట్ల పారితోషికాన్ని వసూలు చేస్తుందని టాక్.

సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.ఎప్పుడు కాళీ దొరికినా ఫోటో షూట్స్ లో పాల్గొంటూ.

వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.ప్రెసెంట్ సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.ఈమె ఒక్కో సినిమాకు 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందట.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే.ప్రెసెంట్ చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీ ఇంకా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకు పోతుంది.

ప్లాప్స్ వస్తున్నా కూడా ఈమెకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.ప్రెసెంట్ ఈమె సినిమాకు 5 కోట్లు డిమాండ్ చేస్తుందట.

Telugu Nayanatara, Pooja Hegdhe, Pushpa, Rashmika Madana, Samantha, Indian Actre

అనుష్క శెట్టి అంటే ఇష్టపడని ప్రేక్షకులు లేరు.ఈమె జేజమ్మ అలరిస్తూనే డార్లింగ్ సరసన చిందేసింది.ఇక బాహుబలి సిరీస్ తో అయితే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చుకుంది.ఇక ఈమె ప్రెసెంట్ సినిమాకు 4 కోట్లు అందుకుంటుందట.ఇప్పుడు చేస్తున్న సినిమాలు తక్కువ అయినా కూడా ఈమెకు డిమాండ్ బాగానే ఉంది.రష్మిక మందన్న కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్ళు అవ్వకుండానే అప్పుడే ఈ బ్యూటీ భారీ పారితోషికం అందుకుంటుంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సినిమాకు 3 కోట్లు పుచ్చుకుంటుందట.వీరే కాదు ఇంకా చాలా మంది హీరోయిన్స్ 2 నుండి 3.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు.దీంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube