రామ్ చరణ్ కోసం కోట్లు కుమ్మరించిన డిస్నీ హాట్ స్టార్

మెగాస్టార్ నటవారసుడు రాంచరణ్ ఖాతాలో మరో ఎండార్స్ మెంట్ చేరింది.ప్రతిష్టాత్మక ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెర్రీ ఎంపికయ్యాడు.

 Remuneration Of Ram Charan For Disney Hot Star Details, Ram Charan, Disney Plus-TeluguStop.com

మన వినోద విశ్వం అంటూ డిస్నీ హాట్ స్టార్ ను రాం చరణ్ ప్రమోట్ చేస్తున్నాడు.ఈ కంపెనీకి తను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం పట్ల తను చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

అటు తమ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రాంచరణ్ కు సంస్థ భారీగా డబ్బు ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.ఏడాదికి 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అటు రాంచరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నాడు.ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ కొమురం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తున్నారు.వీరికి తోడుగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది సస్పెన్స్ గా ఉంది.

అటు రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమా ప్రారంభం అయ్యింది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Telugu Disneyhot, Pan India Mvoie, Ram Charan, Ramcharan, Ram Charna-Telugu Stop

కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది.మెగాస్టార్ చిరంజీవి ఈ సినా మూహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు.దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరెక్కుతోంది.ఈ సినిమాకు సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారాం.ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు తుస్తోంది.ఈ పేరుతో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన కవితా సంపుటికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.

ఈ పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube