Javed Akhtar: జావేద్ అక్తర్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా.. ఒక్క పాటకు ఆయన ఏకంగా అంత తీసుకుంటున్నారా?

టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఎంతోమంది సింగర్లు, రచయితలు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.వారిలో చాలామంది కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకుంటున్నారు.

 Remuneration Of Famous Lyricist Javed Akhtar For Dunki Movie Nikle The Kabhi Hu-TeluguStop.com

అటువంటి వారిలో ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్( Javed Akhtar ) కూడా ఒకరు.కాగా జావేద్ అక్తర్ పేరు వింటే చాలు ఎన్నో మరపురాని మధురమైన గీతాలు స్ఫురణకు వస్తాయి.

గీత రచయితగా ఆయన ఎంతో మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఒకటి రెండు కాదు దాదాపుగా ఐదు దశాబ్దాలుగా అర్థవంతమైన, హృదయాలను రంజింపజేసే పాటలతో బాలీవుడ్‌ సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నటించిన తాజా చిత్రం డంకీ.( Dunki ) తాజాగా విడుదలైన ఈ చిత్రంలో చిత్రంలో జావేద్‌ అక్తర్‌ రాసిన నిక్‌లే థే కభీ హమ్‌ ఘర్‌ సే( Nikle The Kabhi Hum Ghar Se ) గీతం మ్యూజిక్‌ ఛార్ట్స్‌లో అగ్ర భాగాన కొనసాగుతున్నది.ఈ పాటకు జావేద్‌ అక్తర్‌ దాదాపుగా 25 లక్షల రెమ్యునరేషన్‌ తీసున్నారట.ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.సింగిల్‌కార్డ్‌తో పాటలు రాయడం నాకు అలవాటు.దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ( Raj Kumar Hirani ) ఒకే ఒక్క పాట రాయమని కోరడంతో సున్నితంగా తిరస్కరించాను.

ఎలాగైనా నేనే పాట రాయాలని అతను పట్టుబట్టాడు.సినిమా పట్ల అతనికున్న పాషన్‌ చూసి కాదనలేకపోయాను.మ్యూజిక్‌ ఛార్ట్స్‌ ఈ గీతం అగ్రభాగాన కొనసాగడం చాలా ఆనందంగా ఉంది అని జావేద్‌ అక్తర్‌ తెలిపారు.భారతీయ సినీ చరిత్రలో ఒక పాటకు తీసుకున్న అత్యధిక పారితోషికం ఇదేనని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

దీంతో ఈ విషయంలో ఆయన రికార్డు సృష్టించారు.ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube