ఫ్యామిలీ మ్యాన్ 2 నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఇటీవలే రాజ్ డీకే దర్శకత్వం లో విడుదలైన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని నాగార్జున కోడలు సమంత కీలక పాత్రలో నటించింది.

 Remunerations Of The Family Man 2 Actors, Family Man 2 , Remuneration, Samantha,-TeluguStop.com

ఇక ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైన సమయంలో కొన్ని వివాదాలు కూడా ఎదురయ్యాయి.ఇందులో తమిళ టైగర్లను చెడుగా చూపించారని తమిళులు తీవ్రమైన అభ్యంతరాలు చేశారు.

ఈ సిరీస్ విడుదల కానివ్వకుండా అడ్డు పడ్డారు.కానీ చివరికి ఈ సిరీస్ విడుదల కాగా మంచి సక్సెస్ ను అందుకుంది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో సమంత పాత్ర కు మంచి స్పందన కూడా వచ్చింది.

దాంతో సమంత కు బాలీవుడ్ లో పలు అవకాశాలు కూడా అందుతున్నాయి.ఇక ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్ తన నటనతో బాగా మెప్పించాడు.

ఇందులో కీలక పాత్రలో నటించిన నటుల పారితోషకం ఎంతంటే.

ఈ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో నటించిన మనోజ్ బాజ్ పాయ్ రూ.10 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Telugu Amazon Stream, Manoj Bajpayee, Priyamani, Raj Dk, Samantha, Tamil Tigers,

ఇక సమంత రూ.4 కోట్ల పారితోషికం ను అందుకుంది.శ్రీకాంత్ తివారి భార్య పాత్రలు నటించిన ప్రియమణి రూ.80 లక్షలు తీసుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

అంతేకాకుండా గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి సీజన్ విడుదల కాగా మంచి సక్సెస్ అందుకుంది.

అందులో నటించిన నటులు కూడా తమ పాత్రలకు మంచి గుర్తింపు అందుకున్నారు.ఇక గతంలో కూడా వీరి పారితోషకం విషయంలో బాగానే అందుకున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే త్వరలోనే డైరెక్టర్ రాజ్ డీకే సీజన్ 3 మొదలు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube