నేటి సమాజంలో సోషల్ మీడియా గురించి తెలియని వారంటూ ఉండరు.ఇక సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు.
ఇక వెండితెర, బుల్లితెర కనిపించే నటులను కొంతమంది సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉంటారు.అయితే నటులు డీజిల్ మీడియాలో ఒక్క ఇంటర్వ్యూకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో చూద్దమా.
ఈటీవీలో ప్రసారమైన జబర్దస్థ్ షోతో సుడిగాలి సుధీర్ బుల్లితెరకు పరిచయమైయ్యారు.ఆయన ఏదైనా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే రూ.30 వేలు తీసుకుంటారు.కనీసం పాతిక వేలు ఇవ్వనిదే దొరకరు.
కనీసం వారానికి ఒకటి ఇస్తుంటారు.హైపర్ ఆది ఏదైనా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే రూ.15 వేలు నుండి రూ.20 వేలు తీసుకుంటారు.గెటప్ శీను కూడా ఇదే ధర ఉంటుంది.ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్, నరేష్, చంటి, ముక్కు అవినాష్ తదితరులు ఇంట్వ్యూలు ఇవ్వాలంటే రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇటీవల కొంచెం ఫెమస్ అయిన ఇమ్మాన్యుయేల్, వర్ష జంటగా రావాలంటే రూ.25 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక సినిమాల్లో సైడ్ పాత్రలు వేసే మధ్య వయసు నటీమణులు కూడా మంచి మార్కెట్ ఉంది.
ప్రగతి, సురేఖ వాణీ, హేమ, పవిత్ర లోకేష్ తదితరుల ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో వస్తే లక్షల్లోనే వ్యూస్ వస్తాయి.వీరిలో ఎక్కువగా ప్రగతి, సురేఖ వానికి డిమాండ్ ఉంటుంది.
అందుకే పారితోషికం కూడా అలాగే ఉంటుంది.ఒక గంట ఇంటర్వ్యూ కి ప్రగతి రూ.20 వేలు, సురేఖ వాణీ 20 వేలు వరకు తీసుకుంటారు.హేమ, పవిత్ర లోకేష్ లు రూ.12 వేలు అడుగుతారు.యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో అందరి కంటే ఎక్కువ డిమాండ్ చేసేది యాంకర్ అనసూయ.ఆమె ఒక గంట ఇంటర్వ్యూ కి రూ.40 వేలు తీసుకుంటారు.రష్మీ రూ.20 వేలు, వర్షిణి రూ.12 వేలు వరకు తీసుకుంటారు.