బయట పడ్ద ట్రంప్ అసలు రహస్యం.. అమెరికన్లు షాక్..!!  

Removing Social Distancing Stickers Trump Rally - Telugu America, Donald Trump, Donald Trump Oklahoma Rally Video, Removing Social Distancing Stickers

డోనాల్డ్ ట్రంప్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అగ్రరాజం అమెరికా ప్రెసిడెంట్ గా అందరికి తెలుసు.

 Removing Social Distancing Stickers Trump Rally

ఆయన రూటే వేరు.అందరి లాగా ఆయన చెయ్యారు.

ఆయనకి నచ్చిందే చేస్తారు.ఆయనకు నచ్చనిది ఏవరైనా చేస్తే ఇక అంతే సంగతులు.

బయట పడ్ద ట్రంప్ అసలు రహస్యం.. అమెరికన్లు షాక్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

మీడియా ముఖంగానే రెచ్చిపోతారు.అదేదో సినిమాలో ఓ పాట లో చెప్పినట్లు “నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నానయిజం తెగువని కొందరు అన్నా అది నాలో మానరిజం నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒక వైపూ నేను ఒక్కడనీ ఒక వైపూ లోకం ఒక వైపూ” అంటూ ట్రంప్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంటాడు.

ఆయన చేసే వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.ఈయన దగ్గర మొహ‌మాటం అనేది ఏదీ ఉండ‌దు.చెప్పాల‌నుకున్న‌దే చెప్తారు.చెయ్యాలి అనుకున్నదే చేస్తారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏం మాట్లాడినా సంచలనమే.ఏం చేసినా విశేషమే.

ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి.ఆయన చేసే ప్రకటనలు, హావభావాలు, మాటలు విభిన్నం.

ఆతనకు తిక్క రేగితే మాట్లాడుకోవడాలు ఉండవ్వు.పోట్లాడు కోవడాలే ఉంటాయి.

అందుకు నిదర్శనం ఈ ఏడాది ప్రారంభం లో జరిగిన ఇరన్-అమెరికా మధ్య గోడవలే.

అయితే, ఈ నవంబర్ 3అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

సహజంగా ఏ రాజకీయ నేత ఆయినా ఎన్నికలు దగ్గర పడుతుంటే ఏం చేస్తారు.ప్రచారాలు, ర్యాలీలు, మేం అధికారం లోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలు ఇస్తారు.

ఆ తరువాత అవి మరిచిపోతారు అనుకోండి అది వేరే మ్యాటర్.ప్రస్తుత్తానికి ట్రంప్ కూడా అలాగే చేస్తున్నారు.

కానీ కొంచెం ప్రత్యేకంగా ప్రచారాలు చేస్తున్నారు.

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎందులో అయినా సరే అగ్రరాజ్యం నెం.1 అనిపించుకుంటుంది అన్నట్లు.కరోనా పాజిటివ్ కేసుల్లోను.మరణాల్లోను టాప్ లో ఉంది.అయినా సరే ఎన్నికల్లు ఆపే ప్రసక్తే లేదు అంటూ.ట్రంప్ ఎన్నికలకు రెడీ అయిపోయారు.

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్.ఈ నెల 20న ఓక్లహోమాలోని టుల్సా నగరంలో భారీ ఇండోర్ ర్యాలీని నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో కార్యకర్తలు భౌతిక దూరాన్ని పాటించే విధంగా.కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఇద్దరు మధ్య ఒక సీటు ఖాళీగా ఉండే విధంగా స్టిక్కర్లు అతికించారు.

అంత వరకు బాగానే ఉంది.

కానీ ఎందుకు చేసారో.ఏమో కానీ.

సడెన్ గా, ర్యాలీకి ట్రంప్ హాజరయ్యే కొద్ది సమయం ముందు.ఆయన పార్టీ వలంటీర్లు స్టిక్కర్లను తీసేసారు.

ఇంకేముంది అక్కడ భౌతిక దూరం నిబంధన అమలు కాకుండా తుంగలో తోక్కేసారు.ఈ దృశ్యాలని అక్కడే ఉన్న ఓ ప్రముఖ మీడియా చిత్రికరించింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను సదరు మీడియా సంస్థ ప్రసారం చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కరోనా తీవ్రతను పట్టించుకోకుండా ఎన్నికల ర్యాలీని నిర్వహించిందే కాకుండా.

భౌతిక దూరం నిబంధన కూడా అమలు చేయరా అంటూ పలువురు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.ఇక నెటిజన్లు అయితే భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఒకరు ఏమో.నిపుణుల హెచ్చరికను పెడచెవిన పెట్టారు ట్రంప్ అంటుంటే.మరోకరు ట్రంప్ రాజకీయాని కి శుభం కార్డ్ పడింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Removing Social Distancing Stickers Trump Rally Related Telugu News,Photos/Pics,Images..

footer-test