మృతకణాలను వదిలించేందుకు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మీకోసం!

చ‌ర్మంపై మృత కణాలు ఏర్ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.అయితే వీటిని త్వ‌ర‌గా తొలిగించుకోకుంటే మాత్రం చ‌ర్మం కాంతి హీనంగా మారిపోవ‌డ‌మే కాదు.

 Remove Dead Skin Cells Dead Skin Cells Home Remedies-TeluguStop.com

మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి.అందుకే ముఖం అందంగా మెర‌వాలంటే మృత‌క‌ణాల‌ను వ‌దిలించుకోవాల్సిందే అని బ్యూటీష‌న్లు చెబుతుంటారు.

దీంతో చాలా మంది డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలిగించే క్రీములు వాడుతుంటారు.కానీ, న్యాచుర‌ల్‌గా కూడా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 Remove Dead Skin Cells Dead Skin Cells Home Remedies-మృతకణాలను వదిలించేందుకు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ మీకోసం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Beauty, Beauty Tips, Dead Skin Cells, Glowing Skin, Home Remedies, Latest News, Remove Dead Skin Cells, Skin Care-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

మృత‌క‌ణాల‌ను నివారించ‌డంలో యాపిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్ గుజ్జు, తేనె మ‌రియు బ్రౌన్ షుగ‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే.డెడ్ స్కిన్ సెల్స్ పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే ఓట్స్‌తో కూడా మృత‌క‌ణాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.ఓట్స్‌ను మెత్త‌గా పౌడ‌ర్ చేసి.అందులో చిటికెడు బేకింగ్ సోడా మ‌రియు హాట్ వాట‌ర్ పోసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి.

డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కొద్దిగా వాట‌ర్ జ‌ల్లి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో కాఫీ పౌడ‌ర్‌, అలోవెరా జెల్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసుకుని.స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో స్క్ర‌బ్ చేయాలి.ఆ త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే మృత‌క‌ణాల స‌మ‌స్యే ఉండ‌దు.

దాంతో మీ చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మ‌రియు అందంగా క‌నిపిస్తుంది.

#Beauty Tips #Dead Skin Cells #Glowing Skin #RemoveDead #Home Remedies

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు