రాజు గారికి చుట్టూ జగన్ ఉచ్చు ? అది కూడా పోగొడతారా ?  

removal of raghuram krishna raju from the parliamentary standing committee with jagans recommendation raghuramakrishnamraju , ysrcp , ap ,tdp ,bjp , Punjab National Bank, Lok Sabha Speaker, CBI Rides - Telugu Ap, Bjp, Cbi Rides, Lok Sabha Speaker, Punjab National Bank, Raghuramakrishnamraju, Tdp, Ysrcp

ఎవరూ తగ్గట్లే,  ఎవరి రేంజ్ లో వారు రాజకీయం చేసేస్తున్నారు.ఎవరి స్థాయిలో వారు విమర్శలు చేస్తున్నారు.

TeluguStop.com - Removal Of Raghuram Krishna Raju From The Parliamentary Standing Committee With Jagans Recommendation

ఎవరికి వారు తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహారాలు చేస్తున్నారు.ఎన్నో గందరగోళ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయి.

అధికార పార్టీ వైసీపీ నుంచి గెలుపొందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీపై అసంతృప్తి గానం వినిపిస్తూ, ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో సఖ్యత గా ఉంటూ, హడావుడి చేస్తూ వచ్చారు.ఆయన విషయంలో అధిష్టానం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా, పరిస్థితిలో మార్పు రాకపోగా, ఆయన మరింతగా వైసీపీ పైనా, జగన్ పైన విమర్శలు చేస్తుండడంతో ఆయనపై అనర్హత వేటు వేయించాలని లోక్  స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

TeluguStop.com - రాజు గారికి చుట్టూ జగన్ ఉచ్చు అది కూడా పోగొడతారా -Political-Telugu Tollywood Photo Image

ఇక ఆ కథ అక్కడితో అయిపోయింది అనుకుంటున్న సమయంలో, అదేపనిగా రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలకు దీటుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ తో జగన్ భేటీ అయిన సందర్భంగా రామకృష్ణ రాజు అంశాన్ని సైతం ప్రస్తావించినట్లు గా ప్రచారం జరిగింది.ఆ తరువాత రఘురామకృష్ణంరాజు ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడం , ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకు మొత్తం 826.17 కోట్ల మొత్తంలో రుణాలు బకాయి పడడంతో దీనికి సంబంధించి ఆయన బ్యాంకులకు సరైన సమాధానం చెప్పకపోవడం వంటి వ్యవహారాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ బ్యాంకు మేనేజర్ సౌరబ్ మల్హోత్ర ఫిర్యాదు చేశారు  మేరకు సిబిఐ రంగంలోకి దిగి ఈ వ్యవహారంలో తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.అయినా ఆ తర్వాత వైసీపీ పై విమర్శలు చేస్తూనే రాజు గారు వస్తున్నారు.తాజాగా వైసిపి ఫిర్యాదు మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవి నుంచి కూడా రఘురామకృష్ణంరాజు తొలగించి ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరి ని నియమించారు.

ఇక్కడితో రాజుగారు కదా సమాప్తం అనుకున్నా.

వైసీపీ మాత్రం ఆయనను వదిలిపెట్టేది లేదు అన్నట్లు దాని బట్టి ఆయనపై అనర్హత వేటు వేస్తే గాని , తాము శాంతించు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

బిజెపి కేంద్ర పెద్దలు వైసీపీతో సఖ్యతగా ఉంటూ వస్తుండడంతో ఇదే సమయంలో అనర్హత వేటు వేయించి, అధిష్టానంపై ఎవరు తిరుగుబావుటా ఎగురవేసిన రాజు గారి పరిస్థితి వస్తుంది అనే సంకేతాలు ఇవ్వాలని వైసిపి చూస్తున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే రాజు గారి అనర్హత వేటు ఫైలు కి కూడా విముక్తి రాబోతున్నట్లు సమాచారం.

#Ysrcp #PunjabNational #CBI Rides

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Removal Of Raghuram Krishna Raju From The Parliamentary Standing Committee With Jagans Recommendation Related Telugu News,Photos/Pics,Images..