ఒకప్పటి ఈ హీరో మీకు ఇంకా గుర్తున్నాడా..?  

Jai Akash, Tollywood hero, Anandam movie, Yesteryear hero, - Telugu Anandam Movie, Jai Akash, Tollywood Hero, Yesteryear Hero

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “ఆనందం” చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన  హీరో ఆకాష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే జై ఆకాష్ అసలు పేరు సతీష్ నాగేశ్వరన్ కానీ సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత జై ఆకాష్ గా పేరు మార్చుకున్నాడని ఇప్పటికే చాలా మందికి తెలియదు.

 Remember This Hero Of Yesteryear

అంతేగాక జై ఆకాష్ శ్రీలంకలో పుట్టిన తమిళీయన్ కానీ సినిమా అవకాశాలు భారత దేశంలో సెటిల్ అయ్యాడు.అయితే తెలుగులో తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న జై ఆకాష్ తన తదుపరి చిత్రాలతో మళ్లీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

కానీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.అయితే తనకు సినిమా అవకాశాలు లేని సమయంలో తానే సొంతంగా సినిమాలకు దర్శకత్వం వహించడమేగాక నిర్మాతగా కూడా వ్యవహరించాడు ఆకాష్.

ఒకప్పటి ఈ హీరో మీకు ఇంకా గుర్తున్నాడా..-Latest News-Telugu Tollywood Photo Image

కానీ ఆ ప్రయత్నాలు కూడా వృధా అవడమే కాకుండా పలు ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టాయి.ఇక జై ఆకాష్ వ్యక్తిగత విషయానికి వస్తే తమిళ సినీ పరిశ్రమకు చెందినటువంటి నిషా అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఇటీవలే ఆకాష్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్ర కథనం తనదంటూ ఏకంగా నష్ట పరిహారం  చెల్లించాలని దావా కూడా వేశాడు.అయితే ఆ దర్శకుడు మాత్రం చిల్లిగవ్వ కూడా చెల్లించేది లేదని స్పష్టం చేశాడు.

అయితే ఈ విషయంఇలా ఉండగా తెలుగులో జై ఆకాష్ నటించినటువంటి ఆనందం, వసంతం, నవ వసంతం, అందాల రాముడు, గోరింటాకు తదితర చిత్రాలు బాగానే హిట్ అయ్యాయి.కానీ   ఆకాష్ కి మాత్రం ఈ చిత్రాలు ఎలాంటి గుర్తింపు మరియు కొత్త  సినీ అవకాశాలు తీసుకురాలేకపోయాయి.

కాగా ప్రస్తుతం జై ఆకాష్  చెన్నై 2 బ్యాంకాక్ అనే  తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే ఈ  చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేస్తున్నాడు.

#Yesteryear Hero #Jai Akash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Remember This Hero Of Yesteryear Related Telugu News,Photos/Pics,Images..